PoK Protest: పాకిస్తాన్.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకోవైపు భారత్‌రుసగా మోహరిస్తున్న సైన్యంతో ఆపరేషన్ 2.0 భయం పట్టుకుంది. ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్ టెన్షన్ పెడుతోంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పీవోకేలో కూడా నిరసనలు తీవ్రమవుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. ముజఫరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఫీజుల పెరుగుదల, అసౌకర్యాలపై ఆందోళన చేస్తున్న సమయంలో, పోలీసులు వారి పై గుర్తుతెలియని బృందాల దాడులు చేస్తున్నాయి. కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడులకు పాక్ ఐఎస్‌ఐ ఆధునిక మామూల్‌ఫహాద్ అనే నాయకుడు ఆధ్వర్యం వహిస్తున్నట్లు సమాచారం.
ఉద్యమాలను అణచివేస్తున్న ఐఎస్‌ఐ..
పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ పీవోకే ఉద్యమాలు, నిరసనలను వ్యూహాత్మకంగా అణచివేస్తోంది. తాజాగా విద్యార్థులు భారత్‌కు అనుకూలంగా నిరసనలు తెలుపుతున్నారని భావించింది. పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమంగా పేర్కొంది. ఇది ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తుందని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఐఎస్‌ఐ ఏజెంట్ మమూల్ ఫహాద్ మరికొందరితో కలిసి నిరసనకారులపై కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆందోళనలు క్రమంగా ఉధృతం చేస్తున్నారు.
మరో అంతర్యుద్ధం?
పీవోకేలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇది ఒక అంతర్యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ శాఖలు, గూఢచర్య వ్యవస్థలు తమ ప్రయోజనాల కోసం నిరసనలను అణచివేస్తున్నాయి. ప్రజల బాధను మరచిపోతూ, వారి హక్కుల అడ్డుపడే విధంగా రాజకీయ పోరు ఒక అంతర్గత యుద్ధ స్ధితి సృష్టిస్తోంది. ఈ పరిస్థితి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కొత్త యుద్ధంగా మారుతోంది.