PM Modi in Cyprus: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం కెనడా బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో సర్‌ప్రైజ్‌గా ఆయన సైప్రస్ దేశంలో ఆగారు. వ్యూహత్మకంగా మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌లు ప్రముఖ సీఈఓలతో సమావేశమై, భారత్–సైప్రస్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు. భారత్ గత దశాబ్దంలో అమలు చేసిన సంస్కరణలను మోదీ వివరించారు. సైప్రస్ వ్యాపారవేత్తలను భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించారు.
ఆవిష్కరణ, శక్తి, సాంకేతికతలో అవకాశాలు
ఆవిష్కరణ, శక్తి, సాంకేతికత, ఫిన్‌టెక్, రియల్ ఎస్టేట్, షిప్పింగ్ వంటి రంగాల్లో భారత్–సైప్రస్ సహకారానికి విస్తృత అవకాశాలను గుర్తించారు. సైప్రస్‌లోని స్టార్టప్ విజయవంతమైన భారత స్టార్టప్‌లతో భాగస్వామ్యం ద్వారా ఉభయ దేశాలు పరస్పర లాభాలను పొందవచ్చని చర్చించారు. 2023, 2024లో లిమాసోల్‌లో జరిగిన రిఫ్లెక్ట్ ఫెస్టివల్‌లో భారత స్టార్టప్‌లు పాల్గొనడం ద్వారా ఈ సహకారం ఇప్పటికే ఆరంభమైంది.
వ్యూహాత్మక ప్రాముఖ్యత
సైప్రస్, భారత్‌ల మధ్య సంబంధాలు 1960లో సైప్రస్ స్వాతంత్య్రం నాటి నుంచి బలమైనవి. భారత్ సైప్రస్‌కు ఐక్యరాష్ట్ర సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల ద్వారా మద్దతు ఇచ్చింది, ముగ్గురు భారత జనరల్స్ UNFICYP కమాండర్లుగా పనిచేశారు. సైప్రస్ భారత్‌కు యూఎన్‌లో శాశ్వత సభ్యత్వం, ఇండియా–యూఎస్ సివిల్ న్యూక్లియర్ ఒప్పందం వంటి అంశాల్లో మద్దతు ఇస్తోంది. ఈ సంబంధం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులతో పాటు వ్యూహాత్మక సహకారానికి దోహదపడుతుంది.
టర్కీపై వ్యూహాత్మక ఒత్తిడి
భారత్–సైప్రస్ సంబంధాల బలోపేతం, టర్కీతో సైప్రస్ దీర్ఘకాల వివాదం నేపథ్యంలో వ్యూహాత్మకంగా కీలకం. 1974లో టర్కీ దాడి సైప్రస్‌ను రెండుగా విభజించింది, ఉత్తర సైప్రస్‌ను టర్కీ ఆక్రమించింది. ఈ విషయంలో భారత్ సైప్రస్‌కు స్థిరంగా మద్దతు ఇస్తోంది, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాల ఆధారంగా బై–కమ్యూనల్, బై–జోనల్ ఫెడరేషన్‌ను సమర్థిస్తోంది. భారత ప్రధాని సైప్రస్ సందర్శనను టర్కీకి వ్యతిరేక సంకేతంగా భావిస్తున్నారు, ముఖ్యంగా టర్కీ–పాకిస్తాన్ సంబంధాలు, కాశ్మీర్ అంశంలో టర్కీ మద్దతు నేపథ్యంలో. సైప్రస్‌తో భారత్ రక్షణ, సైనిక సహకారం టర్కీపై ఒత్తిడి పెంచడంతో పాటు ఈశాన్య మధ్యధరా ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని పెంచుతుంది.
వ్యాపార సౌలభ్యం
గత దశాబ్దంలో భారత్ అమలు చేసిన సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. సైప్రస్‌లోని వ్యాపారవేత్తలకు భారత్‌లోని ఈ అవకాశాలను అందిపుచ్చేందుకు మోదీ పిలుపునిచ్చారు. సైప్రస్ యూరోపియన్ యూనియన్ సభ్య దేశంగా భారత కంపెనీలకు యూరప్ మార్కెట్‌లకు గేట్‌వేగా ఉపయోగపడుతుంది.
ఈ సమావేశం భారత్–సైప్రస్ మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధాలకు బలమైన పునాది వేసింది. సైప్రస్‌తో సహకారం ద్వారా భారత్ తూర్పు మధ్యధరా ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచుతూ, టర్కీ ఆధిపత్య ఆకాంక్షలను అడ్డుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో ఉభయ దేశాలు సంయుక్త వ్యాపార ప్రాజెక్టులు, సాంకేతిక భాగస్వామ్యాల ద్వారా పరస్పర ప్రయోజనాలను సాధించేందుకు సిద్ధమవుతున్నాయి.