https://oktelugu.com/

China: పిల్లల్ని కనండి ప్లీజ్‌.. జనాభా పెంచేందుకు చైనా తిప్పలు!

ప్రపంచంలో అనేక దేశాలు జనాభా సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. జననాలు తగ్గడంతో చాలా దేశాల్లో యువ జనాభా తగ్గుతోంది. దీంతో జనాభా పెంచేందుకు స్కీంలు ప్రకటిస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2024 4:40 pm
    China

    China

    Follow us on

    China: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. యువ జనాభా కూడా మన దేశంలో చాలా ఎక్కువ. అందుకే మనకు శ్రామిక శక్తి ఎక్కువ. కానీ ప్రపంచంలో చాలా దేశాలు జనాభా సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. జపాన్, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు కూడా పెరుగుతున్న వృద్ధులు, తగ్గుతున్న యువతతో ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జనాభా పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడతున్నాయి. పిల్లల బాధ్యతను కూడా తామే తీసుకుంటామని పేర్కొంటున్నాయి. ఆర్థికసాయం చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు జనాభా నియంత్రణకు అనేక ఆంక్షలు పెట్టిన చైనా ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. జనాభా పెంచాలని కోరినా పిల్లల్ని కనేందుకు అక్కడి దంపతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి మహిళలకు కీలక సూచనలు చేస్తోంది. పిల్లలను కలి జనన రేటు పెంచాలని వేడుకుంటోంది. ఈమేరకు చైనా మార్నింగ్‌ పోస్టు ఓ కథనం ప్రచురించింది.

    మహిళలకు ఫోన్‌..
    చైనా మీడియా కథనం ప్రకారం.. ప్రావిన్స్‌ పుజియాన్‌లో నివసిస్తున్న జేన్‌ హువాంగ్‌ అనే 35 ఏళ్ల మహిళకు ఇటీవల ఓ అధికారి ఫోన్‌చేశారు. ఆ కాల్‌లో ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న ఆయన పిల్లలను కనాలని సూచించారు. మరోవైపు ఆ దేశ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ జియాహోంగులో షేర్‌ చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో తనకు కూడా ఇటువంటి కాల్‌ వచ్చిందని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు.

    తగ్గుతున్న జనన రేటు..
    ఇదిలా ఉంటే.. చైనాలో జనాభా వరుసగా రెండో ఏడాది కూడా తగ్గింది. ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. జనాల సంఖ్య 20 లక్షలు తగ్గినట్లు ంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జనాలు ఉండగా, 1949 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తలిసారి. దేశంలో సంతానోత్పత్తి తగ్గడమే ఇందుకు కారణం. మరోవైపు వృద్ధులు పెరుగుతున్నారు. 2023లో 60 ఏళ్లు పైబడినవారు 30 కోటుల ఉండగా, 2035 నాటికి ఈ జనాభా 50 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే జనన రేటు పెంపుపై చైనా దృష్టి పెట్టింది. మరోవైపు పిల్లలు లేక పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇవి వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుతున్నాయి.