America: అమెరికాలో విశాలమైన భూభాగం ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటే.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో తుపాన్లు అతాలకుతలం చేస్తాయి. ఒకవైపు మంచు కురుస్తుంటే.. మరోవైపు కారుచిచ్చులు దహిస్తుంటాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ జరుగుతుంది. తాజాగా అమెరికాలోని అతి పురాతన అగ్నిపర్వతం బద్ధలైంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాస ఏంజిల్స్‌లోని హవాయ్ బిగ్ ఐలాండ్‌లో ఉన్న కిలోవెయా అనే అగ్ని పర్వతం బద్ధలైందని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ పరవ్తం విస్పోటనం జరిగిందని పేర్కొన్నారు. విస్పోటన సమయంలో అగ్ని పర్వతం నుంచి 260 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విస్పోటనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని పర్వంత నుంచి ఎగిసిపడుతున్న లావా, పొగలు కక్కుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. హవాయ్ బిగ్ ఐలాండ్ సమీపంలో ఉన్నవారికి అధికారులు హెచ్చరికలు చేశారు. అగ్ని పర్వతానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.
విషవాయువులు..
ఇదిలా ఉంటే.. లావా ప్రవాహం నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో విషవాయువులు కలుస్తుండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ ప్రమాదం కారణంగా పంట పొలాలు, జీవరాశులపైనా ప్రబావం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రాబోయే కొన్నేళ్లు ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలను వేగంగా తరలించాలని అధికారులు కోరుతున్నారు.
1983 నుంచి విస్పోటనాలు..
కిలోవెయా అగ్నిపర్వతం గురించి చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా బద్ధలవుతుందని భయం భయంగానే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు బ్లాస్ట్ అయింది. గతంలో ఈ అగ్నిపర్వతం నుంచి స్వల్పస్థాయి విస్పోటనాలు జరిగేవని స్థానికులు తెలిపారు. కానీ ఈసారి భారీ విస్పోటనం జరిగిందని లావా 260 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతోందని పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా పర్వతం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
This morning, around 2:20 AM, a new #Kilauea eruption began within Kaluapele (the summit caldera). It was caught on camera by #HVO‘s B2cam. Images taken by the webcam were compiled into this timelapse video that shows lava fountains feeding lava flows across the caldera floor. pic.twitter.com/w52KpHOtau
— USGS Volcanoes (@USGSVolcanoes) December 23, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Photos show hawaiis kilauea volcano erupting for the second time this year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com