Rishabh Pant : పంత్ వీరవిహారం.. టెస్టులలో టి20 తరహా బ్యాటింగ్.. వీడియో వైరల్

దులీప్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నారు . స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ.. వర్ధమాన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. కొంతమంది బౌలర్లు కూడా అనితర సాధ్యమైన ప్రదర్శనను చూపిస్తున్నారు. బెంగళూరులో చిన్న స్వామి స్టేడియం వేదికగా ఇండియా - బీ, ఏ జట్లు తలపడుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 7, 2024 8:34 pm

Rishabh Pant'

Follow us on

Rishabh Pant : ఇండియా – బీ జట్టు తరఫున రిషబ్ పంత్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 61 రన్స్ చేశాడు. టెస్టులో టి20 తరహా బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.. రిషబ్ పంత్ దాదాపు 21 నెలల తర్వాత ఎరుపు రంగు బంతితో టెస్ట్ క్రికెట్లోకి రీ – ఎంట్రీ ఇచ్చాడు. ఆడుతుంది టెస్ట్ అనే విషయాన్ని మర్చిపోయి అతడు చెలరేగి ఆడాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేసాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్ వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. ఇండియా – బీ జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్ క్రీజ్ లోకి వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి ఇండియా – బీ జట్టును గాడిన పెట్టాడు. సర్పరాజ్ తో కలిసి ఏకంగా మూడో వికెట్ కు 72 పరుగులు జోడించాడు. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ అదే జోరు చివరి వరకు కొనసాగించలేకపోయారు.. పంత్ 61 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సర్ప రాజ్ ఖాన్ 46 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్ , అభిమన్యు ఈశ్వరన్, ముషీర్ ఖాన్, నితీష్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ముషీర్ ఖాన్ రెండవ ఇన్నింగ్స్ లో గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 19 పరుగులు చేసి ఆవుటయ్యాడు. ఇక ప్రస్తుతం సుందర్ 6* క్రీజ్ లో ఉన్నాడు.

రెండవ ఇన్నింగ్స్ లో సత్తా

వాస్తవానికి రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ లో పూర్తిగా నిరాశపరిచాడు. రెండవ ఇన్నింగ్స్ లో 61 పరుగులు చేశాడు. వాస్తవానికి అతడు గనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఇండియా – బీ జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆ జట్టు స్కోరు సునాయాసంగా 300కు చేరుకునేది. కానీ ఎప్పుడైతే పంత్ అవుటయ్యాడో అప్పుడే ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోవడం మొదలైంది. ఇదే దశలో సర్ప రాజ్ ఖాన్ కూడా అవుట్ కావడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మిగతా ఆటగాళ్లు కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఫలితంగా మూడోరోజు ఆట పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టపోయి 150 పరుగులు చేసింది. ఇప్పటికే ఇండియా – ఏ జట్టు కంటే ఇండియా – బీ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రిషబ్ పంత్ మైదానంలో వీరవిహారం చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే వేలల్లో వీక్షణలు సొంతం చేసుకుంది.