Pakistan: పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమం కొనసాగుతోంది. ఖైబర్ ఫక్తూంగ్వా ప్రాంతంలో టీటీపీ దాడులు బలపడుతున్నాయి. సైన్యం పరిస్థితి కూడా అంత బాగా లేదు. సింధ్ ప్రాంతంలో కూడా ప్రజలు తమ ప్రత్యేక హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంతర్గత కలహాలకు తోడు ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్ మరణించారన్న ప్రచారం పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. ఆయన బతికి ఉన్నాడని ప్రజలకు చూపించకుంటే పాకిస్తాన్‌లో అంతర్‌యుద్ధం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పరువును బజారుకు ఈడుస్తున్నారు అక్కడి ప్రజలు
మధ్యతరహా ముస్లిం దేశాల్లో భిక్షాటన..
మధ్యప్రపంచంలోని 55 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్‌పై ప్రజల నిరసనలు, వ్యతిరేక భావాలు పెరిగాయి. పాకిస్తానీ యువత ధనిక దేశాల్లో వీసాలు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియాలో అనేక పాకిస్తానీలు భిక్షాభిక్తులుగా మారడం దేశానికి ప్రతికూల రూపం తెచ్చింది. సమీప గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యూఏఈ, వీసా విధానాలను మరింత కఠినతరం చేసి పాకిస్తానీల ప్రవేశాన్ని ఆంక్షిస్తోంది.
వీసా నిబంధనలు కఠినతరం..
సౌదీ అరేబియాలో పాకిస్తానీల యాచనతో ఆ దేశం వీసాల జారీని కఠినతరం చేసింది. సౌదీలో మసీదుల వద్ద భిక్షాటన చేస్తున్న 5 వేల మందిని కూడా తిప్పి పంపింది. ఇక మరో ముస్లిం దేశం యూఏఈ మాత్రం బ్లూ పాస్‌పోర్ట్ (అధికారుల, మంత్రుల, దౌత్యవేత్తల కోసం) మాత్రమే అనుమతిస్తూ సాధారణ గ్రీన్ పాస్‌పోర్టు ఉన్న పాకిస్తానీల ప్రవేశాన్ని నిషేదించింది. ఈ చర్యలు పాకిస్తాన్‌కు తీవ్రమైన ఆర్థిక, సామాజిక దిగ్బంధాలు కలిగించే ప్రమాదం ఉంది. జూలై నుంచి వీసా మంజూరులు నిలిపివేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. యూఏఈ వెళ్లినవారు అక్కడ దొంగతనాలు, దాడులుచేస్తున్నారు. దీంతో వీసాలు నిలిపివేసింది.
పాకిస్తానీల ఆటంకాలు
టర్కీలో పాకిస్తానీలు ఈవిటీజింగ్, అఘాయిత్యాలకు పాల్పడటంతో విపరీత ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. భారత్ ముస్లింలకు గల్ఫ్ దేశాలు ఆహ్వానించాలని, పాకిస్తానీలు అక్కడకు వెళ్ళకూడదని సూచనలు చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్‌జాతీయ ఆదరణను తీవ్రంగా తగ్గించాయి. యూఏఈ బ్యాన్ విధిస్తే… పాకిస్తాన్‌కు చాలా కష్టం. ఈమేరకు సెనేట్ కమిటీకి నివేదిక ఇచ్చారు. జూలై నుంచే వీసాలు ఇవ్వడం లేదు. విమానం ఎక్కి విమానంలోనూ పాకిస్తానీలు అడుక్కుంటున్నారు. ఇంత దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి ఉంది.