Shehbaz Sharif Praises Trump: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి ముగింపు పలికిన షర్మ్–షేక్ ఒప్పందం ప్రపంచ శాంతి దౌత్యంలో కీలక మలుపుగా నిలిచింది. యుద్ధానికి పరిష్కారం చూపడంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ముఖ్య పాత్ర పోషించింది. ఇది కేవలం మధ్యప్రాచ్యానికి కాదు, అంతర్జాతీయ సమతుల్యతకు కొత్త దిశను సూచిస్తూ ఉంది.
పాకిస్తాన్ ప్రధాని పొగడ్తలు..
ఈజిప్టులో షర్మ్–షేక్ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఇవి.. కేవలం శాంతి వేదికపై చెప్పిన మర్యాదా మాటలు కావు. లోతుగా గమనిస్తే పాకిస్తాన్ కొత్త వ్యూహాత్మక దిశను సూచిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇలాంటి సందర్భంలో అమెరికా సహకారం అత్యవసరం. షరీఫ్ వ్యాఖ్యలు ఆ సహకారం కోసం వేదిక సిద్దం చేయాలనే ప్రయత్నంగా విశ్లేషించబడుతున్నాయి. షర్మ్–షేక్‌లో షరీఫ్ మాటలు ట్రంప్ గ్లోబల్ ఇమేజ్‌ని మరింత బలపరిచాయి. గాజా ఒప్పందానికి తోడు భారత్–పాక్ మధ్య ఘర్షణను నియంత్రించడంలో తన పాత్ర ఉందన్న వ్యాఖ్యలు అమెరికా ‘మధ్యవర్తి’ గుర్తింపుని పునరుద్ధరించాయి. ఇది ట్రంప్ విదేశాంగ విధానానికి నూతన పునాదిగా మారవచ్చు.
భారత్‌కు సంకేతాలున్నాయా?
ఇదిలా ఉంటే.. షరీఫ్ వ్యాఖ్యల్లో భారత్ పరోక్షంగా ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. పాక్ అమెరికా సహకారంతో తమ వైపు అంతర్జాతీయ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నంలో ఉందని భారత విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో గాజా శాంతి సందర్భంలో ట్రంప్ పాత్రను గణనీయంగా ప్రస్తావించడం కూడా అమెరికాకు పాక్ నుంచి ప్రియత చూపించడానికి సంకేతమని భావించబడుతోంది.
పాక్–అమెరికా సంబంధాల్లో మార్పు..
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ కాలంలో దెబ్బతిన్న పాక్–అమెరికా సంబంధాలు, షెహబాజ్ ప్రభుత్వం కాలంలో కొంత సర్దుబాటు దశలోకి వచ్చినట్టుగా ఈ ప్రసంగం చూపిస్తోంది. ట్రంప్‌తో పాజిటివ్ ఇమేజ్ నిర్మించడం ద్వారా పాక్ తన ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను సాధించాలనుకుంటోంది. షరీఫ్ చేసిన ప్రశంసలకు ట్రంప్ చేసిన సరదా స్పందన – ‘‘ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదనుకుంటున్నా’’ అన్న వ్యాఖ్య – ఒకవైపు చమత్కారంలా అనిపించినా, మరోవైపు అమెరికా శాంతి దౌత్యంపై విశ్వాసం పెరుగుతోందనే పరోక్ష సూచన.
షర్మ్–షేక్‌లో జరిగిన ఈ సంఘటన కేవలం శాంతి సమావేశం కాదు.. ఇది పెరుగుతున్న నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రతిబింబం. పాక్ తన వైదేశిక ప్రయోజనాలకు అమెరికా మద్దతు కోరుతుండగా, ట్రంప్ నేతృత్వంలోని అమెరికా గ్లోబల్ లీడర్‌గా తిరిగి స్థానం మూటగట్టుకుంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Pakistan PM Sharif PRAISES Trump for stopping India-Pak war
‘India and Pakistan are both NUCLEAR powers’
‘Had he not intervened… war could have escalated to a level who would have LIVED to tell what happened’ https://t.co/bM0fMPcbkB pic.twitter.com/IcNRf1PID1
— RT (@RT_com) October 13, 2025