Trump Meloni Beautiful: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగింపు నేపథ్యంలో ఈజిప్టులోని షర్మ్–షేక్‌లో ప్రపంచ నేతలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ దౌత్య సమీక్షలలో ప్రధాన చర్చా కేంద్రంగా మారింది. ఈ వేదికపైనే ట్రంప్ తన ప్రత్యేక శైలిలో వ్యాఖ్యలు చేసి చర్చను మరోమారు మలుపు తిప్పారు.
మెలోని అందం గురించి..
ట్రంప్ తన ప్రసంగంలో ఇటలీ ప్రధాని మెలోనీని ‘అందంగా ఉన్న నాయకురాలు‘గా అభివర్ణించారు. ‘‘ఇలా చెప్పడం నా రాజకీయ జీవితం ముగించవచ్చు కానీ, నేనేమైనా చెబుతాను’’ అనే వ్యాఖ్యతో సభను నవ్వుల్లో ముంచెత్తారు. బయటి నుంచి ఇది సరదా వ్యాఖ్యలా కనిపించినా, దౌత్యరంగంలో ఇది పాపులారిటీని పెంచే వ్యాఖ్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యక్తిగత ప్రసంగ శైలికి చిహ్నం
ట్రంప్ భాషలో వ్యంగ్యం, హాస్యం కలిపిన ప్రత్యేక ధోరణి ఎన్నో సందర్భాల్లో దౌత్య సంబంధాలకు కొత్త వెసులుబాటు తెచ్చింది. ఈ వ్యాఖ్య ద్వారా ఆయన మెలోనీతో స్నేహపూర్వక అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, యూరోప్ నాయకులతో ఉన్న సఖ్యతను సూచించారు. ట్రంప్ మాటలపై మెలోనీతోపాటు అక్కడి నాయకులు నవ్వుతూ స్పందించారు. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింంది. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది దీనిని అనుకూలంగా చూస్తే, మరికొందరు రాజకీయ వేదికలపై వ్యక్తిగత వ్యాఖ్యలు తగవని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత పొగడ్తలు కాకుండా, దౌత్య సమీకరణంలో అమెరికా సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే రీతిగా ఉన్నాయి. మెలోనీని ప్రశంసించడం ద్వారా యూరోప్‌లో తన రాజకీయ మిత్రబంధాలను పటిష్టం చేయాలనే సంకేతం కూడా కనిపిస్తోంది. ప్రపంచ దృశ్యంలో ట్రంప్ నాయకత్వం మళ్లీ ప్రధాన అక్షంగా మారుతోందని ఈ సందర్భం సూచిస్తుంది.
Trump: “I think Pakistan and India are gonna live very NICELY together”
Turns to Shehbaz Sharif: ‘Right?’
Look at Chatukar’s big smile. He still thinks this Joker Trump can save him when Bharat goes for the DECISIVE one?
Anyway, let both of them happy ‘TILL THEN’! pic.twitter.com/qlhS55S3GY
— BhikuMhatre (@MumbaichaDon) October 13, 2025