Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఏంటి మాకీ ఖర్మ అని అమెరికన్లు అనుకునేలా పాలన సాగిస్తున్నారు. అమెరిక్ ఫస్ట్ అని ఎన్నికల సమయంలో అంటే.. నమ్మి ఓటేశామని.. ఫస్ట్ పేరుతో అమెరికాను ఇప్పుడు ఆగం చేస్తున్నాడని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా మూడేళ్లు ఎలా భరించాలని భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థం కాక, ఇటు అమెరికన్లు, అటు ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. తాజాగా ఉగ్రవాద దేశం పాకిస్తాన్‌తో ఈ ట్రంప్‌గాడు చేతులు కలిపాడు. అమెరికా ఫస్ట్ నినాదం పక్కన పెట్టి.. ట్రంప్ ఫస్ట్ అన్నట్లుగా తన వ్యాపారం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఊడిగం చేస్తున్నాడు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధినేత అసీమ్ మునీర్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు, దాదాపు 90 నిమిషాలు రహస్యంగా జరిగింది. ఇది 2019లో ఇమ్రాన్ ఖాన్ తర్వాత వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి పాక్ ప్రధాని సందర్భంగా గుర్తుంచుకుంటున్నారు. ట్రంప్ ఈ రెండు నాయకులను ‘గొప్ప నాయకులు‘గా ప్రశంసించారు, ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్టు సూచిస్తోంది. ఈ భేటీ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్‌కు సందర్భంగా జరిగింది. అంతకుముందు షరీఫ్ ముందుగా అరబ్–ఇస్లామిక్ నాయకులతో ట్రంప్‌కు భేటీ అయ్యారు.
ఏం చర్చించుకున్నారు..?
సమావేశంలో వాణిజ్యం, భద్రత, జియోపాలిటికల్ సమస్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జూలైలో అమెరికా–పాకిస్తాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత, పాక్ వస్తువులపై తక్కువ టారిఫ్‌లు విధించడం ఈ చర్చలకు బలం ఇస్తోంది. ఇజ్రాయిల్–హమాస్ యుద్ధం, గాజా శాంతి కార్యక్రమాలు కూడా ముఖ్య అంశాలుగా ఉండవచ్చు. భద్రతా విషయాల్లో, పాకిస్తాన్ సైన్యం ఐఎస్‌కే (ఐఎస్‌ఐఎస్–కే) సంబంధిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం ట్రంప్‌కు ఆకర్షణీయంగా ఉంది. ఇది పాక్ సైనిక నాయకత్వంతో అమెరికా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని కనిపిస్తోంది. మునీర్‌కు ఇది 2025లో మూడోసారి అమెరికా సందర్శన, ఇందులో జూన్‌లో ట్రంప్‌తో భోజనం చేశారు.
అమెరికాను ముంచే వ్యూహమేనా?
భారత్‌తో పాకిస్తాన్ మధ్య ఘర్షణల సమయంలో అమెరికా పాక్‌ను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. మేలో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్–పాక్ మధ్య సీజ్‌ఫైర్ జరిగిన తర్వాత, షరీఫ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. ఇది ట్రంప్‌కు ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్(భారత్‌పై పాక్ దాడి ఆపరేషన్‌గా అంచనా) తర్వాత మునీర్‌తో ట్రంప్ భేటీ జరగడం, అమెరికా దక్షిణాసియా వ్యూహంలో మార్పును సూచిస్తోంది. భారత్‌పై టారిఫ్‌లు పెంచడం, పాక్‌పై తగ్గించడం ద్వారా ట్రంప్ పాక్‌ను ‘అంతర్గత వృత్తం‘లో చేర్చుకోవాలని చూస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది భారత్‌కన్నా అమెరికాకే ప్రమాదకరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయా లేక.. తాత్కాలికమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, క్రిప్టోకరెన్సీ, ఆర్థిక అభివృద్ధి విషయాలు చర్చల్లో భాగంగా ఉంటే, పాక్ ఆర్థికంగా లాభపడవచ్చు. అయితే, ట్రంప్ మునుపటి పాలనలో పాక్‌ను ‘ఉగ్రవాదుల ఆశ్రయం‘గా పిలిచిన నేపథ్యంలో, ఈ మార్పు తాత్కాలికమేనా అనేది చూడాలి. ఎందుకంటే ట్రంప్ ఎవరినీ పూర్తిగా నమ్మరు. ఎప్పుడు దెబ్బ కొడతారో ఖూడా తెలియదు. తన అవసరం తీరాక కరివేపాకులా తీసిపాడేస్తారు. శాశ్వతమైతే అమెరికాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లే!