Pakistan Troops: పాకిస్తాన్ ప్రస్తుతం విచిత్ర పరిస్థితి ఎదుర్కొటోంది. కరవ మంటే కప్పకు కోపం.. విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది. పెద్దలు మంచివారితో స్నేహం చేయమంటారు. ఎందుకంటే తాను కూడా బాగుపడతారని, కానీ పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడి భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడానికి పాకిస్తాన్ సైనికులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. కోరిలేషన్ ఆఫ్ ముస్లిం సోల్జర్స్ (సీఎంఎస్) కూటమి ఏర్పాటుతో ఈ ప్రణాళిక మరింత తీవ్రతరం అవుతోంది.
పాకిస్తాన్ ఎంపికకు రెండు కీలక కారణాలు
పాకిస్తాన్‌లో 7 లక్షల మంది సైనికులు ఉండటం ప్రధాన కారణం. ఇతర ముస్లిం దేశాలతో పోల్చితే ఇక్కడే అత్యధిక సైన్యం ఉంది. అంతేకాకుండా, ట్రంప్‌కు ఆసిమ్ మునీర్‌పై పూర్తి నమ్మకం ఉంది. ‘నా ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తారు‘ అనే విశ్వాసంతో ఒత్తిడి పెంచారు. చేయకపోతే ఆర్థిక, సైనిక సహాయాలను ఉపసంహరిస్తామని హెచ్చరించారు.
పాకిస్తాన్‌లో అంతర్గత సవాళ్లు..
పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనాకు బలమైన మద్దతు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి సైన్యం హమాస్‌పై దాడి చేస్తే, ఇస్లామిక్ సమాజంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ అనుచరులతో ఆసిమ్ మునీర్ పోరాడుతున్నారు. గాజా మిషన్‌కు సైన్యం పంపితే, విపక్ష పార్టీలు ఏకమై మునీర్‌పై తిరుగుబాటు ప్రారంభించే ప్రమాదం ఉంది. ఇటీవల మునీర్ త్రివిధ దళాల అధినేతగా నియమితులైనా, ఇంకెంత డ్యామేజ్ కంట్రోల్ చేయగలరో సందేహం.
సైనిక సామర్థ్యంపై సందేహాలు..
పాకిస్తాన్ సైన్యానికి హమాస్‌ను జయించే శక్తి లేదని నిపుణులు అంచనా. స్వంత దేశంలో తెహ్రీక్–ఎ–తాలిబాన్ వంటి ఉగ్రవాద గుండాలను అరికట్టలేకపోతున్నారు. గాజాలో ఓటమి జరిగితే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రతిష్ట పడిపోతుంది. ఇప్పటికే ఆఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్ ’ఆపరేషన్ సిందూర్ 2.0’ ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, ప్రజల భావోద్వేగాలు ఈ ప్లాన్‌ను కుప్పకూల్చే అవకాశం ఉంది. మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.