Pakistan Border Conspiracy: పాకిస్తాన్ మన దేశం విషయంలో చేయనీ దుర్మార్గం అంటూ లేదు. అన్ని విధాలుగా మన దేశంలో దారుణాలకు పాల్పడింది. కానీ కొంతకాలంగా పాకిస్తాన్ ఆగడాలు మనదేశంలో చెల్లుబాటు కావడం లేదు. పహల్గాం, పుల్వామా వంటి దాడులతో మన అస్తిత్వం మీద దెబ్బ కొట్టడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేసింది. ఆ ఘటనలు మనదేశంలో సైనికుల వీరమరణానికి కారణమయ్యాయి. ఆ తర్వాత మరొక అవకాశం పాకిస్తాన్ దేశానికి భారత్ ఇవ్వలేదు. ఢిల్లీ పేలుడు సంఘటన తర్వాత మన దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిపోయింది. అజ్ఞాత సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులను ఏరి పారేస్తోంది.
భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి కారణం.. అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్ సరికొత్త విధానంలో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోంది. జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేసేందుకు పాకిస్తాన్ దారుణం చేస్తోంది. మనదేశంలోని సరిహద్దుల్లో ఉన్న లోపలి ప్రాంతాలకు సెల్ ఫోన్ సంకేతాలు అందే విధంగా పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా సరిహద్దుల వెంట భారీగా సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తోంది. వాటి నుంచి వచ్చే సంకేతాలు కతువా, రాజోరి, పుంచ్ వంటి జిల్లాలతో పాటు అత్యంత దుర్మార్గులైన ఉగ్రవాదులను బందీలుగా ఉంచిన జమ్మూ కాశ్మీర్ లోని కోట్ బల్వాల్ జైలుకు కూడా చేరుతున్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ సిమ్ కార్డులు.. ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తున్నట్టు.. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద హ్యాండర్లు.. భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులు.. వారి అనుచరులకు మధ్య సమాచార మార్పిడి జరుగుతుందని తెలుస్తోంది. మనదేశం సెక్యూరిటీ ఫోర్స్ ట్రాకింగ్ తప్పించుకోవడానికి చైనా సహాయంతో సిడిఎంఏ సాంకేతికతను.. స్మార్ట్ఫోన్లను రేడియో సెట్ లతో అనుసంధానం నుంచి వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో ఇప్పటికే సోషల్ మీడియాలో మనదేశంలో ఉన్న యువతను తప్పు దోవ పట్టించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షహజాద్ భట్టి పై భారత ఇంటలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి.
ఇతడు పాకిస్థాన్లో ఉంటూ.. టర్కీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 17 దేశాలలో తన అనుచరులను నియమించుకున్నాడు. వీరందరికీ కూడా గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు సరఫరా చేస్తున్నాడు. మనదేశంలో ఉగ్ర కార్యకలాపాలు.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇతడు కుట్రలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో దాడులకు కూడా పాల్పడ్డాడు. కాకపోతే ఇంతవరకు ఇతడు మనదేశంలో దిగలేదు. ప్రత్యక్షంగా ఎటువంటి కార్యకలాపాలు సాగించలేదు. పరోక్షంగా మాత్రమే దాడులకు పాల్పడే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాడు. ఇతడిని గనక అరెస్ట్ చేస్తే.. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సగం వరకు ఆగిపోతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
