HomeతెలంగాణTelangana Jobs Notification 2026: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!

Telangana Jobs Notification 2026: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!

Telangana Jobs Notification 2026: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. జూన్‌ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగులైన ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, విద్యా, పర్యావరణ, అటవీ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రబుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటన.. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌ […]

Telangana Jobs Notification 2026: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. జూన్‌ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగులైన ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, విద్యా, పర్యావరణ, అటవీ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రబుత్వం నిర్ణయించింది.

ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటన..
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) ద్వారా ఈ నెలలోనే ఇంజినీరింగ్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, టౌన్‌ ప్లానింగ్, అటవీశాఖ, విద్యాశాఖల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

నోటిఫికేషన్లు నిరంతరం జారీ..
సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు. ఒకేసారి ఒక్క నోటిఫికేషన్‌కు పరిమితం కాకుండా, వివిధ శాఖల్లో ఖాళీలు గుర్తించి వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇది యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ముఖ్యమైన అడుగు.

ఏ శాఖల్లో ఎలాంటి అవకాశాలు?
ఇంజినీరింగ్‌ శాఖలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వంటి విభాగాల్లో టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించిన సైంటిఫిక్, టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి. టౌన్‌ ప్లానింగ్‌లో నగరాభివృద్ధి, అర్బన్‌ ప్లానింగ్‌ పోస్టులు ఉన్నాయి. ఇక అటవీశాఖలో అటవీ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, ఇకో–టూరిజం సంబంధిత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు వంటి విద్యా రంగ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణలో నిరుద్యోగం యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఉద్యోగాల భర్తీ ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం పెరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper