Itel Aqua phone price in India: ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ ల హవా సాగుతోంది. ఇలాంటి సమయంలో కీ ప్యాడ్ ఫోన్ గురించి చాలా తక్కువే. కానీ Itel కంపెనీ తాజాగా Aqua పేరుతో ఒక కొత్త కీ ప్యాడ్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. దీనిని చూస్తే సాధారణ బడ్జెట్ ఫోన్ లాగే అనిపిస్తుంది. కానీ ఇది IP67 రేటింగ్ ను కలిగి ఉండడంతో Water and Dust Resistance తో వచ్చిన ప్రత్యేకమైన మోడల్‌గా కంపెనీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం..
బయట పని చేసే వారు, ప్రయాణాల్లో ఎక్కువగా ఫోన్ వాడేవారు, అలాగే రగ్గడ్‌గా ఉండే డివైస్ కోరుకునే వినియోగదారుల కోసం Aqua ఫోన్ను రూపొందించినట్లు తెలుస్తోంది. IP67 రేటింగ్ కారణంగా కొన్ని నివేదికల ప్రకారం.. 30 నిమిషాల వరకూ నీటిలో మునిగినా తట్టుకునేలా డిజైన్ చేశారు. Itel Aqua లో 2.4 అంగుళాల డిస్ ప్లే ఉంది, అలాగే 1,200mAh బ్యాటరీని కూడా అందించారు. దీనికి టైప్ C ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం ఈ సెగ్మెంట్‌లో మంచి అదనపు ఫీచర్‌గా చెప్పొచ్చు.
ఇది కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్ లెస్ ఎఫ్ఎం రెడియో, ఆటో కాల్ రికార్డింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 32GB వరకు స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా AI Environmental Noise Cancellation (ENC) ఫీచర్‌ను కూడా ఇచ్చింది. దీని వల్ల మార్కెట్లు, బస్ స్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో మాట్లాడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దం తగ్గి, కాల్ క్లారిటీ మెరుగుపడుతుంది. భాషా సపోర్ట్ పరంగా కూడా ఈ ఫోన్ ఆకర్షణీయమే, ఎందుకంటే ఇది 10 regional languages ను సపోర్ట్ చేస్తుంది. దీంతో విభిన్న భాషలు మాట్లాడే వినియోగదారులకు ఇది మరింత సులభంగా ఉపయోగించుకునేలా ఉంటుంది.
Blue, Red, Black రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ను కంపెనీ భారత్‌లో రూ. 1,799 ధరకు విడుదల చేసింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్ లో లభిస్తోంది.
