Pakistan shock from Muslim countries: పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అప్పులు చేయనిదే పూట గడవని పరిస్థితిలో ఉంది. రంగు రాళ్లు, రేర్ ఎర్త్ మినరల్స్ అమ్ముకుని కాలం వెల్లదీస్తోంది. ఇక ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేస్తోంది. ముస్లిం దేశమైన పాకిస్తాన్ సౌదీ అరేబియా, కువైట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది. అయితే విద్యుత్ కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్ అందుకు సంబంధించిన నగదు చెల్లించడం లేదు. మా ముస్లిం దేశాలే కదా అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో విద్యుత్ సంస్థ ఇప్పుడు పాకిస్తాన్‌పై దావా వేసింది.
2 బిలియన్ డాలర్ల బకాయి..
సౌదీ అరేబియా, కువైట్ ఇన్వెస్టర్లు పాకిస్తాన్‌పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో 2 బిలియన్ డాలర్ల (సుమారు 16,700 కోట్ల రూపాయలు) దావా వేశారు. కెఎలక్ట్రిక్ సంస్థకు చెల్లింపులు ఆపివేసినట్లు ఆరోపించారు. జనవరి 16న దాఖలైన ఈ కేసు పాక్ ఆర్థిక స్థిరత్వానికి ఆందోళన కలిగించింది.
దావా వివరాలు
32 సౌదీ సంస్థలు, అల్‌జొమా వంటి ప్రముఖ కువైట్ ఇన్వెస్టర్లు కె ఎలక్ట్రిక్‌కు విద్యుత్ సరఫరా చేసిన డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రుణాలను కూడా ప్రత్యక్షంగా తమకు ఇవ్వాలని కోరారు. 5 కువైట్ సంస్థలు కలిసి ఈ చర్య తీసుకున్నాయి.
పాకిస్తాన్ స్థితి
పాక్ ప్రభుత్వం చెల్లింపులు ఆపేయడంతో సౌదీ, కువైట్ మిత్రదేశం అని కూడా చూడకుండా చట్టపరమైన మార్గం ఎంచుకున్నారు. కె ఎలక్ట్రిక్ విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేక ఆర్థిక సమస్యల్లో ఉంది. ఈ దావా పాక్ ఎనర్జీ రంగాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది.
పేకా పేకాటే అన్నట్లు పాకిస్తాన్ విషయంలో ఇంతకాలం ఓపిక పట్టిన సౌదీ, కువైట్ ఇప్పుడు సహించలేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. వ్యాపార ఒప్పందాలు చట్టబద్ధంగా ఉంటాయి. 2 బిలియన్ డాలర్ల పాకిస్తాన్ బడ్జెట్‌పై భారాన్ని పెంచుతుంది.