Zardari on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ మొదట అబద్ధాలు చెప్పి, తర్వాత నిజాలు ఒప్పుకుంది. భారత్ దాడికి తలొగ్గి సీజ్‌ఫైర్ చేసామని, లేదా అమెరికా మధ్యవర్తిత్వంతో ఆగామని మార్చి మార్చి చెప్పింది. కానీ ఇప్పుడు పాక్ నాయకులే వారి బలహీనతలు బయటపెడుతున్నారు–ఇది భారత సైనిక విజయానికి గట్టి ఆధారాలు.
పాక్ నాయకుల్లో భయం..
ఆసిఫ్ అలీ జర్దారీ బహిరంగ ఓ సభలో మాట్లాడుతూ భారత దాడి మొదలైన వెంటనే ప్రధాన నాయకులు, అధికారులు బంకర్లలోకి పరిగెత్తారు. తనను కూడా ప్రత్యేక బంకర్‌కు తీసుకెళ్లమని సైన్యం సూచించిందని చెప్పారు. ఆసిమ్ మునీర్‌తో పాటు అందరూ దాక్కున్నారు. యుద్ధం చేయాల్సిన నాయకులు పారిపోవడం పాకిస్తాన్ మానసిక బలహీనతకు స్పష్టమైన రుజువు.
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ ధ్వంసం..
ఇస్లామాబాద్ సమీపంలోని నూర్‌ఖాన్ బేస్–పాక్ అణు కమాండ్ స్థాణం. ఇక్కడ భారత్ దాడి చేసింది. డిప్యూటీ పీఎం ఇషాక్ ధర్ 80 మిసైళ్ల దాడులు జరిగాయని, 79ను తిప్పికొట్టామని చెప్పాడు. కానీ 80 మిసైల్ బేస్‌ను తాకింది. మొదట ఏమీ జరగలేదని బుకాయించినా, ఇప్పుడు మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి–అమెరికా అణు ఆయుధాలు ఉన్నందున ఈ వేగం.
అమెరికా ఒత్తిడి..
పాక్ అబద్ధాలు అమెరికాను కూడా కలవరపరిచాయి. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు ’తందానా’ అని తిడుతూ తానే సీజ్‌ఫైర్ సాధించానని ప్రకటించారు. డీజీఎంవో చర్చల తర్వాత పాక్ తెల్ల జెండా ఊపింది. ఇప్పుడు ఇషాక్ ధర్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయని ఒప్పుకున్నారు–భారత దాడి ప్రభావానికి స్పష్ట సాక్ష్యం. ప్రతిపక్షం రఫాల్‌ల గురించి అడిగినా, నూర్‌ఖాన్ దాడి వాస్తవాలు భారత విజయాన్ని నిరూపిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ పాక్ బలహీనతలను బయటపెట్టింది. భారత్ మరిన్ని ఆపరేషన్‌లకు సిద్ధంగా ఉండాలి. అణు స్థాణాలపై ఖచ్చితమైన దాడులు, మనస్తాంత్రిక ఒత్తిడి–ఇవి పొరుగు శత్రువును అరచేస్తాయి.