Mamata Banerjee game is over: సర్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నకిలీ ఓటర్లను తొలగించేందుకే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమైంది. సుమారు 40 లక్షలకుపైగా ఫేక్ ఓటర్లను తొలగించారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తోంది. నవంబర్ 4న ప్రారంభమైన సర్ ప్రక్రియ డిసెంబర్ 4న ముగియనుంది. ఇదిలా ఉంటే.. పశ్చిబెంగాల్‌లో సీరియస్ విధంగా జరుగుతున్న ఓటర్ల సర్వేకు అక్కడి ప్రభుత్వం ఆటంకాలు కలిగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లు తొలగించకుండా చేస్తున్న ఒత్తిడి కారణంగా 28 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఆత్మహత్య చేసుకున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే..
పశ్చిమబెంగాల్‌లో చాలా వరకు ఫేక్ ఓటర్లు ఉన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఎక్కువగా నకిలీ గుర్తింపు కార్డులతో ఓటుహక్కు పొందారు. సర్ ప్రక్రియతో వీరంతా బయటపడుతున్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి.. వారి ఆధారాలు పరిశీలిస్తున్నారు. స్థానికేతరులను గుర్తించి ఓటు రద్దు చేస్తున్నారు. అయితే నకిలీ ఓటర్లను తొలగించకుండా మమతా బెనర్జీ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఆమె ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు బీఎల్వోలపై ఒత్తిడి చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తే తర్వాత మీ సంగతి చెబుతా అని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఫేక్ ఓటర్లు తొలగించకపోతే ఈసీ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక 28 మంది బీఎల్వోలు ఆత్మహత్య చేసుకున్నారు.
34 లక్షల ఆధార్ కార్డులు డీయాక్టివేట్..
ఇదిలా ఉంటే బెంగాల్‌లో 34 లక్షల మంది చనిపోయినవారి ఆధార్ కార్డులు యాక్టివ్‌లో ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వెంటనే యూఐడీఏఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. మరణించినవారి ఆధార్ కార్డులు డీయాక్టివేట్ చేయాలని కోరారు. దీంతో యూఐడీఏఐ వెంటనే ఈ కార్డులను డీయాక్టివేట్ చేసింది.
మమతకు చెక్..
ఒకవైపు నకిలీ ఓటర్ల తొలగింపు.. ఇంకోవైపు మళ్లీ రాకుండా ఆధార్ కార్డుల డీయాక్టివేట్.. ఇంకోవైపు బీఎల్వోల నుంచి వచ్చిన వారికి మాత్రమే కొత్తగా ఓటుహక్కు కల్పించేలా యాప్ రూపొందించడంతో మమతా బెనర్జీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఎల్‌ఓ లను పర్యవేక్షించేందకు బీజేపీ కూడా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించింది. దీంతో వారు కూడా అక్రమాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. దీంతో మమతకు దారులన్నీ మూసుకుపోతున్నాయి.
జనాభాకన్నా ఓటర్లు ఎక్కువ..
ఇదిలా ఉంటే.. సర్ ప్రక్రియతర్వాత ఈసీ 2002 ఓటరు జాబితాను పరిశీలిస్తోంది. అందులో ఉన్నవారి కుటుంబాలను పోల్చి చూస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా జనాభాకన్నా ఓటర్లు గణనీయంగా ఉన్నారు. సాధారణంగా జనాభాకన్నా 10 నుంచి 15 శాతం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కానీ బెంగాల్‌లో 48 శాతం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీనిని కూడా ఈసీ పరిశీలిస్తోంది. నకిలీ ఓటర్లు పట్టుబడుతున్నారు. వారికి జరిమానా, జైలు శిక్ష విధిస్తోంది. దీంతో బంగ్లాదేశీయులు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మన బీఎస్‌ఎఫ్ కూడా పంపిస్తోంది. దీంతో దొంగ ఓటర్లు తగ్గుతున్నారు. ఇవన్నీ మమతా బెనర్జీకి మైనస్‌గా మారుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన సర్ ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో బంగ్లాదేశ్, రోహింగ్యాల ఓటర్ల మద్దతుతో గెలిచే అవకాశం లేదు. మమతా బెనర్జీ గేమ్ ఓవర్ అయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.