Homeఅంతర్జాతీయంPakistan collapse: ఊహించిందే జరుగుతోంది.. పతనం దిశగా పాకిస్తాన్!

Pakistan collapse: ఊహించిందే జరుగుతోంది.. పతనం దిశగా పాకిస్తాన్!

Pakistan collapse: 1947లో ముస్లిం లీగ్‌ విభజన ఆధారంగా ఆవిర్భవించింది. అయితే కొన్ని రోజులకే దేశం ఉనికి కోల్పోతుందని విభజన సమయంలో ముస్లిం పార్టీలను అధ్యయనం చేసినవారు అంచనా వేశారు. విడిపోవడం పాకిస్తాన్‌కు మంచిది కాదని హెచ్చరించారు. కానీ అప్పటి నేతలు ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని కోరుకున్నారు. అయితే ఎనలిస్ట్‌ రిషి అరవింద్, బాబు రాజేంద్రప్రసాద్‌ కూడా విభజనను వ్యతిరేకించారు. ఇప్పుడు పాకిస్తాన్‌ పరిస్థితి చూస్తే నాటి అంచనాలు నిజమే అనిపిస్తోంది.

చరిత్రాత్మక హెచ్చరికలు..
స్వాతంత్య్రానికి ముందు ముస్లిం రాజకీయాలు, లీగ్‌ స్వభావాన్ని అధ్యయనం చేసిన నాయకులు పాకిస్తాన్‌కు దీర్ఘాయుష్కు లేదని పేర్కొన్నారు. ఇడియా డివైడెడ్‌ పుస్తకంలో దేశం అఘాతానికి గురవుతుందని రాజేంద్రప్రసాద్‌ విశ్లేషించారు. అయితే ఇంతకాలం అమెరికా మద్దతుతో నెగ్గుకొచ్చిన పాకిస్తాన్‌ ఇప్పుడు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. రాజకీయ అస్థిరత, ఆర్థిక ఇబ్బందుల కారణంగా భారత్‌తో 1948, 1965, 1971, 1984, 1999 యుద్ధాల్లో ఓటమి చవిచూసింది. ఇవి పాకిస్తాన్‌ బలహీనతలను బయటపెట్టాయి. రాజకీయ అస్థిరత, సైనిక జోక్యాలు ప్రగతిని అడ్డుకున్నాయి. ఐMఊ, సౌదీ సహాయాలు ఉన్నప్పటికీ, వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం..
పాకిస్తాన్‌ ప్రపంచంలో 90% భిక్షాటనలకు కారణమైన దేశంగా నిలిచింది. ఐఎంఎఫ్‌ రుణాలు, విదేశీ సహాయాలు ఆధారపడటం వల్ల స్వయం సమృద్ధి దూరమైంది. ప్రభుత్వ సంస్థలు దెబ్బతిని, ప్రజలు ‘బతికుంటే చాలు‘ మనస్తత్వంతో దేశం వదులుతున్నారు. షహబాజ్‌ షరీఫ్, ఆసిమ్‌ మునీర్‌ నేతృత్వం ఈ సమస్యలను తీవ్రతరం చేస్తోంది. ప్రజల్లో అసంతృప్తి పెరిగి, దేశాన్ని వదిలేటని భావన ప్రబలమవుతోంది.

పెరిగిన వలసల తీవ్రత..
షెహబాజ్‌ షరీఫ్, ఆసిమ్‌ మునీర్‌ పాలన మొదలైన తర్వాత ఆ దేశాన్ని వీడేవారి సంఖ్య మరింత పెరిగింది. ఉన్నత విద్యావంతులు పాకిస్తాన్‌లో ఉండలేమని వెళ్లిపోతున్నారు. 2021 నుంచి 2024 మధ్య 7.27 లక్షల మంది దేశం వీడారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 2,144 శాతం పెరిగింది. 2025 నవంబర్‌ నాటికి 6 లక్షల మంది దేశం విడిచి వెళ్లారు. వీరిలో 10 వేల మంది ఇంజినీర్లు, 5 వేల మంది డాక్టర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు ఉన్నారు. ప్రపంచంలో ప్రీలాన్స్‌ రంగంలో 4వ స్థానం ఉన్నా, 23.77 లక్షల ఉద్యోగాలు ఊడుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌కు 1.62 బిలియన్‌ డాలర్ల నష్టం జరుగనుంది.

రాజకీయ అస్థిరత ప్రభావం…
రాజకీయ గందరగోళం, సైనిక–రాజకీయ ఘర్షణలు ప్రగతిని అడ్డుకున్నాయి. ప్రజలు దేశాన్ని వదిలేటని భావిస్తున్నారు. ఈ బ్రెయిన్‌ డ్రెయిన్‌ దీర్ఘకాలంలో ఆర్థికం, సాంకేతికతలను బలహీనపరుస్తుంది. చరిత్రాత్మక హెచ్చరికలు, మెదవి వలసలు, ఆర్థిక ఆధారపడటం పాకిస్తాన్‌ను విభజన ఫలితాల వైపు మళ్లిస్తున్నాయి. స్థిర పాలన, స్వయం సమృద్ధి లేకపోతే, దేశ విచ్ఛిన్నం సమీపంలో ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version