KCR assembly entry: తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చాలా కాలం తర్వాత అసెంబ్లీకి రాబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన తొలి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అరోజు కూడా ఒక్కరోజు అసెంబ్లీలో ఉండి వెళ్లిపోయారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో నందినగర్‌లోని తన ఇంటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలపై ఆరా..
అసెంబ్లీలోని తన చాంబర్‌లో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహిస్తారు. శీతాకాల సమావేశాల ఎజెండా ఏమిటి. ఏయే అంశాలపై ప్రభుత్వాని నిలదీయాలి అనే అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల అంశాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించడంతోపాటు డీపీఆర్ తిప్ప పంపండం, పర్యావనణ అనుమతులు ఇవ్వడకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు పట్టు..
ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ జనవరి 2న గోదావరి జలాలపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ కూడా ఇదే డిమాండ్ చేయబోతోంది. తమకు కూడా ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుపట్టాలని నిర్ణయించనట్లు తెలిసింది.
ఇతర సమస్యలపై..
ఇక రాష్ట్రలో ప్రస్తుతం ఎరువుల కొరత ఉంది. ఈ అంశంపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాల ఎజెండా వచ్చిన తర్వాత మరిన్న అంశాలపై ప్రభుత్వాని ఎలా ఇరుకున పెట్టాలనే అంశాలపై ప్రణాళిక రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కూడా సిద్ధం..
ఇక మరో ప్రతిపక్షం బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఎరువుల కొరత, జాబ్‌నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలపై నిలదేశీ అవకాశం ఉంది. ఈమేరకు ఆ పార్టీ ఇప్పటికే సమావేశం నిర్వహించి శీతాకాల సమావేశాలపై ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది.
అధికార పార్టీ కూడా..
ఇక అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలకు దీటుగా స్పందించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. శ్రీధర్‌బాబు కేసీఆర్ సూచనలను మర్యాదగా స్వీకరిస్తామని ప్రకటించారు. అర్థవంతమైన చర్చకు అనుమతులు ఇస్తామన్నారు. ఇక అసెంబ్లీని రాజకీయాలకు అడ్డాగా మార్చుకోవద్దని విప్ ఆదిశ్రీనివాస్ బీఆర్‌ఎస్‌కు సూచించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు జరగినన్ని రోజులు రావాలని సూచించారు. అసెంబ్లీలో జరిగే అన్ని చర్చల్లో పాల్గొనాలని తెలిపారు.