Homeఅంతర్జాతీయంIndus Water Dispute: సింధూ జలాలు కావలట... పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం సాగుతూ ఉంటుంది. అభివృద్ధి ఉండదు. శాంతి భద్రతలు ఉండవు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందదు. చివరికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటే ప్రజలకు కనీసం పరిహారం కూడా అందదు. ఇంతటి దుస్థితిలో ఉంది పాకిస్తాన్. అయినప్పటికీ అక్కడి పాలకులు మీసాలు మేలేస్తూ ఉంటారు. తమ పరిపాలన గొప్పదని.. తమ దేశం అద్భుతమని డప్పు కొట్టుకుంటూ ఉంటారు.

అంతర్జాతీయ వేదికల మీద ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ భారత్ మీద విషం చిమ్ముతూనే ఉంటుంది. లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఉగ్రవాదులతో అంట కాగుతూ.. చైనా, అమెరికా దేశాలకు ఊడిగం చేస్తూ అంతర్జాతీయ వేదికల మీద.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. విషయం ఉండదు. వివరణ ఉండదు. సబ్జెక్టు ఉండదు. ఆబ్జెక్ట్ అంతకంటే ఉండదు. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని చూసి మిగతా దేశాలు నవ్వుతుంటాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో మధ్యవర్తి పాత్ర పోషించి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్.. తాజాగా కెనడా ముందు కూడా పాకిస్తాన్ తలవంచింది.

సింధు జనాల ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ కెనడా విదేశాంగ మంత్రి తో చర్చ జరిగింది. కాశ్మీర్ అంశంలో.. సింధు జలాల ఒప్పందంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ దేశాన్ని చెందిన ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కెనడా ప్రభుత్వాన్ని కోరారు. కెనడా విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు కూడా జరిపారు.. అయితే ఈ సమావేశం తర్వాత రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ప్రకటనలో సింధుజలాలు.. జమ్ము కాశ్మీర్ ప్రస్తావన గురించి చర్చ లేకపోవడం విశేషం.

సింధు జలాలు.. జమ్ము కాశ్మీర్ విషయంలో చర్చ రాకపోవడంతో పాకిస్తాన్ ఇజ్జత్ మరోసారి పోయింది. కెనడా ద్వారా మన మీద ఒత్తిడి తీసుకురావాలని పాకిస్తాన్ అనే రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే కెనడా విదేశాంగ శాఖ మంత్రి గా అనిత ఆనంద్ కొనసాగుతున్నారు. ఆమె భారత సంతతికి చెందిన మహిళ. ఆమెతో ఇషాక్ ద్వైపాక్షిక చర్చ జరిపారు. ఆయన చెప్పిన మాటలను ఆమె విని వదిలేశారు. అంత తప్ప సీరియస్ గా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే భారత్తో కెనడాకు చాలా అవసరాలు ఉంటాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో కూడా రెండు దేశాల మధ్య కోట్ల డాలర్ల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు పాకిస్తాన్ మాటలు కెనడా ఎందుకు నమ్ముతుంది. ఇద్దరు మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత.. జమ్ము కాశ్మీర్.. సింధు జలాల వ్యవహారం గురించి సంయుక్త ప్రకటన రాలేదు. కనీసం దీని గురించి కెనడా మీడియా కూడా పట్టించుకోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version