Pakistan Drama Group Ramayana: రంగస్థలం నాటకాలకు ఈమధ్య కాలం లో ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. సినిమా ఇండస్ట్రీ వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీటిని పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. కానీ రంగస్థలం మీద మక్కువ పోని కళాకారులు ఇప్పటికీ రంగస్థలం నాటకాలను వేస్తూనే ఉన్నారు. మన దేశం లోనే కాదు శత్రు దేశమైన పాకిస్థాన్(Pakistan) లో కూడా రంగస్థలం నాటకాలు, అది కూడా రామాయణం(Ramaayan) పై చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మన పురానా గాధాలపై మనమే ఈమధ్య కాలం లో రంగస్థల నాటకాలు చేయడం తగ్గించాము. ఎక్కడో చాలా అరుదుగా చూస్తుంటాము. కానీ శత్రు దేశం పాకిస్తాన్ లో యోగేశ్వర్ కరేరా,రాణా కజ్మాల బృందం ఇటీవలే కరాచీ నగరంలో రామాయణం ఇతిహాసం పై ప్రదర్శించిన రంగస్థలం నాటకం బాగా వైరల్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
యోగేశ్వర్ కరేరా,రాణా కజ్మాలకు మొదటి నుండి నాటక రంగం పై విశేషమైన మక్కువ. థియేటర్ ఆర్ట్స్ లో కూడా వీళ్లకు గొప్ప ప్రావిణ్యం ఉంది. వీళ్ళు కొంతమంది కళాకారులతో కలిసి ‘మౌజ్’ అనే నాటక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్ లో ‘ది సెకండ్ ఫ్లోర్’ పేరిట ఉన్న ఒక ఆర్ట్ గ్యాలరీ లో తొలిసారి ఈ బృందం రామాయణం పై నాటకం ప్రదర్శించింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో పాకిస్థాన్ లో అనేక ప్రాంతాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది మౌజ్ బృందం. రీసెంట్ గా కరాచీ లో చేసిన నాటకం లో ఒక అడుగు ముందుకు వేస్తూ, కృత్రిమమేధ సాయంతో రంగస్థల వేదికలు రంగులమయం గా మార్చేసి,మూడు రోజుల పాటు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. రామాయణం నాటక ప్రదర్శన చేయడం వల్ల స్థానికుల నుండి ఎలాంటి బెదిరింపులు రాలేదా అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యోగేశ్వర్ ని అడగ్గా,అలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని చెప్పుకొచ్చాడు.
రామాయణం ని ఒక దృశ్యకావ్యం లాగా మలిచి రంగస్థల నటన ప్రదర్శన చేశాము, వాటికి పాకిస్థాన్ స్థానికుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మొదట్లో మేము ఊహించలేదని ఆయన చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ క్రిటిక్స్ నుండి కూడా నాటకానికి మంచి రివ్యూస్ వచ్చాయని ఆయన చెప్పుకొచ్చాడు. మన దగ్గర ఇప్పుడు నాటకాలకంటే ఎక్కువగా సినిమాలకు ఆదరణ ఉంది. పాత సినిమాల్లో రామాయణాన్ని ఎంతో అద్భుతంగా చూపించేవారు. కానీ ఈమధ్య మాత్రం ఆ స్థాయిలో రామాయణం ని మన డైరెక్టర్స్ చూపించలేకపోయారు. అయితే హిందీ లో దంగల్ దర్శకుడు నితీష్ తివారి వాల్మీకి రచించిన రామాయణం ఆధారంగా కనీవినీ ఎరుగని రేంజ్ భారీ బడ్జెట్ , VFX హంగులతో రామాయణాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందో చూడా