spot_img
Homeఅంతర్జాతీయంPakistan Debt Crisis 2026: ఆర్థిక సంక్షోభంలో అప్పు తీర్చబోతున్న పాకిస్తాన్‌.. ప్రజలపై మరింత భారం!

Pakistan Debt Crisis 2026: ఆర్థిక సంక్షోభంలో అప్పు తీర్చబోతున్న పాకిస్తాన్‌.. ప్రజలపై మరింత భారం!

Pakistan Debt Crisis 2026: పాకిస్తాన్‌ అప్పుల సంక్షోభంలో కొట్టుబిట్టాడుతోంది. చైనా నుంచి సౌదీ అరేబియా వరకు, యూఏఈ నుంచి తుర్కియే వరకు అన్ని దేశాల నుంచి అప్పులు చేసింది. ప్రపంచంలో ఏ దేశం అప్పు ఇస్తే ఆ దేశం నుంచి తీసుకోవడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. రుణం తీసుకోవడం వరకు ఓకే.. కానీ తిరిగి చెల్లించేప్పుడు రీషెడ్యూల్‌ చేయాలని, వడ్డీ మాఫీ చేయాలని, వాయిదాల్లో చెల్లిస్తామని బతిమిలాడడం, ఆలస్యంగా చెల్లిస్తానని వేడుకోవడం పాకిస్తాన్‌కు అలవాటైంది. కానీ ఇప్పుడు ఒక దేశం తమ రుణం చెల్లించాలని అడగడంతో నెల రోజుల్లో చెల్లించేందుకు సిద్ధమైంది.

పాకిస్తాన్‌ అప్పులు ఇలా..
పాకిస్తాన్‌ చైనా (30 బిలియన్‌), సౌదీ అరేబియా (20 బిలియన్‌), యూఏఈ (10 బిలియన్‌), ఐఎంఎఫ్‌ (6 బిలియన్‌) డాలర్ల చొప్పున అప్పులు చేసింది. మొత్తం విదేశీ రుణం 130 బిలియన్‌ డాలర్లు దాటింది. రుణం తీసుకోవడం సహజం, కానీ తిరిగి చెల్లించడం పాకిస్తాన్‌కు తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో యూఏఈ మాత్రం కఠినంగా వ్యవహరించి, నెల రోజుల్లో రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది.

యూఏఈ ఒత్తిడికి కారణం ఇదే..
యూఏఈ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌. ఇటు ఇరాన్‌ తో స్నేహం, అటు సౌదీ–యూఏఈ కూటమికి దగ్గరగా ఉండటం. పాకిస్తాన్‌ ప్రధాని, సైనికాధికారులు, సంపన్నులు దుబాయిలో 17,000 మంది 23,000 ఆస్తులు (విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీలు) కొనుగోలు చేశారు. అప్పు తీర్చకపోతే ఈ ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం తమ ఎలైట్‌ వర్గం ఆస్తులను కాపాడుకోవడానికి దేశాన్ని మరింత దారిద్య్రంలోకి నెట్టే నిర్ణయం తీసుకుంది.

ప్రజలపై పన్నుల భారం..
అపుపలు తీర్చేందుకు ప్రజలపై పాకిస్తాన్‌ పాలకులు పన్నుల భారం వేస్తున్నారు. పంజాబ్‌ ప్రభుత్వం ఆవుపేడ నేలపై పడితే రూ.30 పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పన్ను. దీనికి తోడు పెట్రోల్‌ ధరలు 40 శాతం పెంచింది. గోధుమ పిండి కిలో రూ.80, బియ్యం రూ.120, విద్యుత్‌ బిల్లులు 50 శాతం పెరిగాయి. రూపాయి విలువ 35% పడిపోయింది. ఆర్థిక సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. 40 శాతం మంది పాకిస్తానీలు పేదరికం రేఖకు దిగువన ఉన్నారు.

అంతర్జాతీయ ఒత్తిళ్లు..
కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వడానికి పన్నులు పెంచాలని ఐఎంఎఫ్‌ ఒత్తిడి చేస్తోంది. సబ్సిడీలు తగ్గించాలని షరతులు విధించింది. విద్యుత్‌ ప్రాజెక్టుల బకాయిలు 5 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఇరాన్‌తో పాకిస్తాన్‌ సంబంధాలపై సౌదీ అరేబియా అసంతృప్తి వ్యక్తం చేసి, రుణ రీషెడ్యూలింగ్‌ నిరాకరించింది. ఈ ఒత్తిళ్ల మధ్య పాకిస్తాన్‌ మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పాకిస్తాన్‌ తక్షణం 2.45 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దీనికి మరిన్ని అప్పులు చేస్తే, వడ్డీ భారం పెరిగి 2027 నాటికి దివాలా తీసే ప్రమాదం ఉంది. ప్రజా ఆందోళనలు, సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. సంస్కరణలు (పన్నుల విస్తరణ, ఎగుమతుల పెంపు) చేయకపోతే, పాకిస్తాన్‌ శ్రీలంక లాగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version