spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Political Damage Control: జగన్ మావిగన్ ప్రతిపాదన.. పగవాడికి కూడా ఈ కష్టం...

YSR Congress Political Damage Control: జగన్ మావిగన్ ప్రతిపాదన.. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు

YSR Congress Political Damage Control: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పొలిటికల్ డామేజ్ కంట్రోల్ కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన ఆ పార్టీకి పొలిటికల్ గా చాలా డ్యామేజ్ చేసింది. అయితే అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు కానీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకట్ట వెయ్యలేకపోతోంది. చివరకు గతంలో వైసీపీ సోషల్ మీడియాలో పని చేసిన వారు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మావిగన్ పై వ్యతిరేక ప్రచారం నడుస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఎనలిస్టులు సైతం జగన్మోహన్ రెడ్డి తీరును చూసి విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఆస్థాన ఎనలిస్టు కేఎస్ ప్రసాద్ బూతులతో రెచ్చిపోతున్నారట. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నియంత్రించేందుకు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు.

* తీవ్ర ఆవేదనతో..
ప్రధానంగా చాలామంది వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు( social media activists ) జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చేసిన వెంటనే.. ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. అయితే ఒక్క ట్రోల్స్ మాత్రమే కాదు. బయట మార్కెట్లో సైతం ప్రతి చోటా దీనిపై చర్చ నడుస్తోంది. చివరకు టీ దుకాణాల వద్ద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా సామాన్యులు సైతం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యతిరేకత చూస్తున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం వెనక్కి తగ్గుతున్నారు. తాజాగా వైసీపీ నేత ఒక్కరు సోషల్ మీడియా యాక్టివిస్టితో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రజలు విపరీతంగా వ్యతిరేకత ఉందని.. ఆ డ్యామేజ్ కంట్రోల్లో తాను పాలు పంచుకోలేనంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తేల్చి చెప్పడం విశేషం.

* కేఎస్ ప్రసాద్ తాగి మాట్లాడుతున్నాడు అంటూ..
అయితే ఆ ఇద్దరు ఫోన్ సంభాషణలో కేఎస్ ప్రసాద్ ( KS Prasad)చర్చకు వచ్చారు. ఇటీవల కేఎస్ ప్రసాద్ మావిగన్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. జనాలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కె ఎస్ ప్రసాద్ కామెంట్స్ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు సదరు వైసిపి నేతతో కూడా ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేఎస్ ప్రసాద్ తో తాను ఫోన్లో మాట్లాడానని.. జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టాడు అంటూ చెప్పారు. అందుకు సదరు నేత కేఎస్ ప్రసాద్ రాత్రి తాగి ఉంటే అలానే మాట్లాడుతాడని.. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version