spot_img
Homeఅంతర్జాతీయంPakistan Debt Crisis 2026: అప్పుల ఊబిలో పాకిస్తాన్‌.. షాక్‌ ఇస్తున్న చైనా, సౌదీ, యూఏఈ!

Pakistan Debt Crisis 2026: అప్పుల ఊబిలో పాకిస్తాన్‌.. షాక్‌ ఇస్తున్న చైనా, సౌదీ, యూఏఈ!

Pakistan Debt Crisis 2026: పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ తగ్గుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక చమురు సంక్షోభం సరేసరి. ఇలాంటి పరస్థితిలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంక్షల కూరుకుపోయిన పాకిస్తాన్‌ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుంది. అందులో నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన దేశాలు రికవరీకి ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం విదేశీ రుణాలు 130 బిలియన్‌ డాలర్లు మించాయి. ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఆర్థిక సంక్షోభంపై ప్రసంగిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు. మరోవైపు మిత్ర దేశాలు యూఏఈ, సౌదీ అరేబియా, చైనా వంటి మిత్రదేశాలు బిలియన్స్‌ డాలర్ల బకాయిలు చెల్లించమని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇది పాక్‌కు అనూహ్య షాక్‌గా మారింది.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

యూఏఈ తాత్కాలిక సాయం..
యూఏఈ పాకిస్తాన్‌కు గతంలో నగదు డిపాజిట్లు, పెట్రోలియం క్రెడిట్‌ లైన్ల రూపంలో బిలియన్స్‌ డాలర్ల సహాయం చేసింది. ఇప్పుడు ఈ రుణాలు బకాయిగా మారాయి. అయితే, యూఏఈ కొంచెం సహనంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు చెల్లింపు గడువు ఇచ్చింది. ఇది పాక్‌కు శ్వాస తీసుకునే సమయం ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక పరిష్కారం లేకపోతే ఒత్తిడి మరింత పెరుగుతుంది. యూఏఈ ఇస్లామాబాద్‌తో మంచి సంబంధాలు కాపాడుకోవడానికి ఈ దశ తీసుకుందని విశ్లేషకులు అంచనా.

సౌదీ అరేబియా ఒత్తిడి..
ఇక మరో గల్ప్‌ దేశం సౌదీ అరేబియా పాక్‌పై అత్యంత కఠినంగా ఉంది. యుద్ధ సహాయం చేయకపోవడంతో గతంలో ఇచ్చిన సుమారు 6.3 బిలియన్‌ డాలర్ల అప్పులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. గతంలో సౌదీ పాక్‌కు 3 బిలియన్‌ డాలర్లు డిపాజిట్‌ చేసి ఐఎంఎఫ్‌ రుణాలు రావడానికి సహాయం చేసింది. కానీ ఇప్పుడు రుణ రికవరీపై దృష్టి పెట్టింది. ఈ ఒత్తిడి పాక్‌ రిజర్వులను (సుమారు 9 బిలియన్‌ డాలర్లు) మరింత బలహీనపరుస్తోంది. సౌదీ తన స్వంత ఆర్థిక సంస్కరణలు (విజన్‌ 2030) కోసం ఇలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

బిల్లుల వసూలుకు చైనా ఒత్తిడి..
చైనా పాక్‌పై ఎనర్జీ రుణాల మీద ఒత్తిడి పెట్టింది. చైనా ఎనర్జీ కంపెనీకి చెల్లించాల్సిన సుమారు 220 మిలియన్‌ డాలర్లు చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పవర్‌ ప్లాంట్లతో ముడిపడి ఉన్నాయి’ పాక్‌ విద్యుత్‌ ధరలు భారీగా పెరిగి, పౌడర్‌ కట్స్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. చైనా మొత్తం 30 బిలియన్‌ డాలర్లు సీపీఈసీలో పెట్టుబడి పెట్టింది, కానీ రుణాలు తిరిగి రావాలని ఇప్పుడు డిమాండ్‌ చేస్తోంది. ఇది పాక్‌ శక్తి రంగాన్ని మరింత డొలగడానికి దారి తీస్తోంది.

పాక్‌ జీడీపీ 2 శాతానికి దిగిపోయింది, ద్రవ్యోల్బణం 25% పైనుంది. రుణాలు జీడీపీలో 80 శాతం మించాయి. రుపీ విలువ పడిపోవడం, ఇంధన ధరలు పెరగడం, ఆహార ధరలు పెరగడంతో ఐఎంఎఫ్‌ రుణం కోసం పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో గతంలో అప్పులు ఇచ్చిన దేశాలు సహాయం చేయడానికి ముందుకు రాకపోగా పాత అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది పాక్‌ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version