Homeఅంతర్జాతీయంPakistan Crisis 2026: సంక్షోభంలో పాకిస్తాన్‌.. మీడియాలో రాకుండా కవర్‌..!

Pakistan Crisis 2026: సంక్షోభంలో పాకిస్తాన్‌.. మీడియాలో రాకుండా కవర్‌..!

Pakistan Crisis 2026: మన దాయాది దేశం పాకిస్తాన్‌కు పెద్ద చిక్కు వచ్చింది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఆ దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడి చేస్తోంది. ఇందులో ఎవరివైపు ఉండాలో పాకిస్తాన్‌ తేల్చుకోలేకపోతోంది. పొరుగున ఉన్న 900 కి.మీ సరిహద్దు ఉన్న ఇరాన్‌కు అండగా ఉండాలా.. లేక తమకు అవసరానికి అప్పులు ఇచ్చే సౌదీ అరేబియాకు అండగా ఉండాలా.. గాజా ఇంటర్నేషనల్‌ స్టెబిలైజేషన్‌ ఫోర్స్‌లో భాగమైన యూఏఈ వైపు ఉండాలా అనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు భారత్‌తో వైరం కొనసాగుతోంది. భారత్‌ను నిందించడమే పనిగా పెట్టుకుంది. ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్‌తో గొడవలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఫ్గానిస్తాన్‌ చేస్తున్న ప్రతిదాడులు పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం చేస్తున్నాయి. ఇలా అన్నివైపులా పాకిస్తాన్‌ దెబ్బతింటోంది. ఈ పరిస్థితి దేశ భద్రతా వ్యవస్థను బలహీనపరుస్తోంది.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

దిక్కుతోచని పరిస్థితి..
ఇరాన్‌కు మద్దతు ఇస్తే సౌదీ అప్పులు ఆగిపోతాయి. యూఏఈకి సాయం చేస్తే గల్ఫ్‌ సంబంధాలు దెబ్బతింటాయి. మరోవైపు ఆఫ్గాన్‌ చేస్తున్న ప్రతిదాడులు సరిహద్దు ప్రాంతాల్లో నష్టాలు కలిగిస్తున్నాయి. భారత్‌పై నిరంతర ఆరోపణలు చేస్తూ, దేశం అంతర్జాతీయ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. ఒత్తిళ్లు పాకిస్తాన్‌ను దిక్కుతోచని పరిస్థితిలో పడేశాయి.

ఇలా మేనేజ్‌ చేస్తోంది..
ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సాధారణంగా చర్చలు జరుపుతాయి. మధ్యవర్తిత్వం కోరుతాయి. తెరవెనుక ప్రయత్నాలు చేస్తాయి. కానీ పాకిస్తాన్‌ ఇవేమీ చేయడంలేదు. తనకు సులభంగా వచ్చే పని చేస్తోంది. అదే పాకిస్తాన్‌లో జరుగుతున్న నష్టాన్ని మీడియాలో రాకుండా చూసుకుంటోంది. యద్ధాల గురించి, జియో పాలిటిక్స్, సెక్యూరిటీ గురించి వార్తలు ఇవ్వకుండా ఆదేశించింది. ఆఫ్గాన్‌తో యుద్ధం, గల్ఫ్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ పాత్రపై చర్చ జరగకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మీడియాలో మాట్లాడడం మానేశారు. విశ్లేషకులు మౌనం పాటిస్తున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ సంబంధిత ఉద్యమాల కవరేజీ కూడా తగ్గించాలని ఆదేశాలు. ఈ ఆంక్షలు ప్రజలకు నిజాలు తెలియకుండా చూస్తున్నాయి.

భయంతో కూడిన మౌనం..
పాకిస్తాన్‌లో విమర్శనాత్మక వార్తలు చెప్పే జర్నలిస్టులు కిడ్నాప్, హత్యలకు గురవుతున్నారు. సీనియర్లు కూడా ధైర్యం చెలాయించలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్నవారు మాత్రమే మాట్లాడుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచ పరిణామాలు ప్రజలకు అందుతున్నప్పటికీ, అధికారిక మీడియా నిశ్శబ్దంగా మారింది.

ప్రభుత్వం చర్చలు, మధ్యవర్తిత్వం చేయకుండా సమస్యలను దాచిపెట్టడం పరిష్కారం కాదు. ఆర్థిక, భద్రతా సంక్షోభాలు మీడియా ఆంక్షలతో దాచితే ప్రజల అసంతృప్తి పెరుగుతుంది. దీర్ఘకాలంలో రాజకీయ స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల పునర్నిర్మాణం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper
Exit mobile version