Indus Water Treaty: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇందులో అత్యంత కీలకమైనది సిందూ జలాల ఒప్పందం రద్దు ఒకటి. ఈ ఒప్పంద రద్దుతో పాకిస్తాన్‌లో జల సంక్షోభం నెలకొంది. రక్తం, నీరు ఒకేసారి పారవని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. సిందూ జలాల నిలిపివేతతో పాకిస్తాన్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రపంచ కోర్టు మద్దతుతో ఏదో విజయం సాధించినట్లు విర్రవీగుతోంది. కానీ భారత్ అంగీకారం లేకుండా చుక్క నీరు కూడా పాకిస్తాన్‌కు వెళ్లలదు.
Also Read: పోలీస్ కండకావరం.. లాగిపెట్టి కొట్టడంతో స్పృహ తప్పిపోయిన షాపు ఓనర్: వైరల్ వీడియో
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం..
సింధు జలాల ఒప్పందం 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య జల వనరుల పంపిణీని నియంత్రిస్తుంది. 80 శాతం జలాలు పాకిస్తాన్, 20 శాతం భారత్ వినియోగించుకోవాలి. ఇంతకాలం భారత్ 20 శాతం జలాలు వినియోగించుకోలేదు. వాజ్‌పాయి హయంలో ప్రయత్నం జరిగింది. తాజాగా రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో ఈ ఒప్పందం రద్దు చేస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయ కోర్టుకు పాకిస్తాన్..
సిందూ జలాల నిలిపివేతతో పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒప్పందం పున సమీక్ష విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. తద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పింది. దీంతో పాకిస్తాన్ తానేదో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకుంటోంది. పాకిస్తాన్ ప్రజల ముందు చెప్పుకుంటోంది. కానీ భారత్ అంగీకరిస్తేనే మూడో మధ్యవర్తిత్వం జరుగుతుంది. దీనిని భారత్ తిరస్కరించే అవకాశం ఉంది.
మూడో పక్షం మధ్యవర్తిత్వానికి భారత్ నిరాకరణ..
భారత్, పాకిస్తాన్‌తో జల వివాదాలపై మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని నిరంతరంగా తిరస్కరిస్తోంది. సింధు జలాల ఒప్పందం విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలు మాత్రమే సాధ్యమని వాదిస్తోంది. 2023లో భారత్ ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని, సవరణలు చేయాలని కోరినప్పటికీ, పాకిస్తాన్ దీనిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, భారత్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసి, తన వాటా నీటిని (పశ్చిమ నదుల నుండి 20%) ఉపయోగించుకునే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
ఉగ్రవాదం, పీవోకే అంశాలే కీలకం..
2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (26 మంది మరణం) తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఈ దాడిని పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో అనుసంధానించిన భారత్, దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా భావించింది. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, దీర్ఘకాలంగా ఉన్న భారత్–పాకిస్తాన్ వివాదాలు ఈ నిర్ణయానికి దోహదపడ్డాయి. ఈ సందర్భంలో భారత్, ఒప్పందం సమీక్ష, నీటి వినియోగంపై కొత్త విధానాలను పరిశీలిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారత్‌కు పశ్చిమ నదుల (ఇండస్, జీలం, చీనాబ్) నీటిలో 20% వాటా ఉంది, అయితే ఈ నీటిని పూర్తిగా ఉపయోగించుకునేందుకు భారత్‌కు తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం, భారత్ ఈ నీటిని ఉపయోగించుకునేందుకు కొత్త ఆనకట్టలు, కాలువల నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ఇది పాకిస్తాన్‌లోని జలాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాకిస్తాన్‌లో వరదలు, జల సంక్షోభం..
2025 ఏప్రిల్ 27న జీలం నదిలో అనూహ్యంగా నీటి మట్టం పెరగడం వల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో వరదలు సంభవించాయి. భారత్ నీటి విడుదలలో సమాచారం పంచుకోకపోవడంతో ఈ వరదలు మరింత తీవ్రమయ్యాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ సంఘటనలు పాకిస్తాన్‌లోని జలాశయాలు ఎండిపోతున్న నేపథ్యంలో జరిగాయి, ఇది ఆ దేశ వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. అవసరం లేని సమయంలో వరదలు, నీటి కొరత సమస్యలు పాకిస్తాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. ఏది ఏమైనా భారత్ వాటర్ బాంబు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేస్తోంది.