spot_img
Homeఅంతర్జాతీయంAsim Munir Controversy Statements: పాక్ ఆర్మీ చీఫ్ మరో దురాగతం.. ఇక మారడా?

Asim Munir Controversy Statements: పాక్ ఆర్మీ చీఫ్ మరో దురాగతం.. ఇక మారడా?

Asim Munir Controversy Statements: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం పాకిస్తాన్‌ను ఆటలో అరటిపండులా మార్చింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని, దిక్కుతోచని పరిస్థితిలో పాకిస్తాన్‌ ఉంది. ఇలాంటి సమయంలో ఇరాన్‌పై యుద్ధాన్ని పాకిస్తాన్‌లోని షియాలు వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌పై సానుభూతి చూపుతున్నారు. దీంతో పాక్‌ పాలకులు ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్‌ మొత్తం జనాభాలో షియాలు 25 శాతం మంది ఉంటారు. అయితే తాజాగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. షియాల్లో ఆగ్రహం రేకెత్తించాయి. రంజాన్‌ ఇఫ్తార్‌ కార్యక్రమంలో ఆసిమ్‌ సంచలన వ్యాఖ్యలు షియా సమాజంలో కోపాన్ని రేకెత్తించాయి.

Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు

ఇఫ్తార్‌ వేదికపై వివాదం
రంజాన్‌ సందర్భంగా పాకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆసిమ్‌ మునీర్‌తోపాటు సున్నీలు, షియాలు హాజరయ్యారు. ఇందులో ఆసిమ్‌ ఇరాన్‌ తరఫున పోరాడాలనుకునే వారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించారు. షియా నేతలు అబ్బాన్‌ నఖ్వీ ఆసిమ్‌ను వారించేందుకు ప్రయత్నించినా, గంటపాటు ప్రసంగించారు. ఇది సున్నీ–షియా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

పాక్‌ సైన్యంలో షియా బలం
పాకిస్తాన్‌ సైన్యంలో 3 లక్షల మంది షియా సిపాయిలు ఉన్నారు. వీరు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. కానీ అది ఆలోచించకుండా ఆసిమ్‌ మాట్లాడారు. తురి, బంగాస్, హజారా తెగలు పంజాబ్, గిల్గిట్‌–బల్తిస్తాన్‌ ప్రాంతాల్లో షియా ఆధిపత్యం కలిగి ఉన్నాయి. దేశ జనాభాలో 25% మంది షియాలు ఇరాన్‌తో సానుభూతి చెందుతున్నారు.

ఆర్థిక ఒత్తిడి వ్యూహం..
ఇరాన్‌ యుద్ధం కారణంగా, పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత పెరిగింది. ఐఎంఎఫ్‌ రుణం రాలేదు. దీంతో ఇక అరబ్‌ దేశాలే పాకిస్తాన్‌కు దిక్కయ్యాయి. యుద్ధ సమయంలో ఆదేశాలకు సహాయం చేయకపోయినా ఆదేశంలోని సున్నీలకు మద్దతుగా ఆసిమ్‌ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సాయం అందదు. అరబ్‌ దేశాల నుంచి ఆర్థిక సహాయం పొందే పాక్, సున్నీలకు మద్దతుగా షియా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అయితే మౌలానా అబ్బాస్‌ వంటి షియా నాయకులు ఈ వ్యాఖ్యలను ఖండించారు.

పాక్‌ ఏర్పాటులో షియా నేతలు ముఖ్య పాత్ర పోషించారు. మహమ్మద్‌ అలీ జిన్నా, జఫరుల్లా ఖాన్‌ షియాలే. ఆసిమ్‌ మునీర్‌ భార్య, సోదరులు కూడా షియా మతస్తులు. 400 సంవత్సరాలుగా పాక్‌ షియాలు ఇరాన్‌తో ఆధ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్మత ఘర్షణలను పెంచుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version