Pakistan Army Chief Asim Munir: ఆసిమ్ మునీర్.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్.. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాజ్యాంగ సవరణ చేయిచి మరీ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీకి కలిపి బాస్‌గా నియమితులయ్యాడు. అయితే బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో తనలోని భయాన్ని బయట పెట్టాడు.
పాకిస్తాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌గా ఆసిమ్ మునీర్ పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. దాడి జరిగితే తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనలలో దాగి ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపించింది – భారతీయ దాడి జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా పోతుందనే భయం కనిపించింది.
న్యూక్లియర్ బంకర్ల నిర్మాణం..
భారత్ దాడిచేస్తే ప్రజలు ఏమైనా తమకు సంబంధం లేదని, రాజకీయ నాయకులు నాశనమైనా ఏమీ కాదనే భావనతో కేవలం సైనికాధికారుల కుంటుంబాలను కాపాడేందుకు ఆసిమ్ మునీర్ ఆరు న్యూక్లియర్ బంకర్ల నిర్మాణం చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. రేడియేషన్ ప్రవేశాన్ని పూర్తిగా అడ్డుకునే పీఎంపీ సీలింగ్ సౌకర్యం ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు అంతరాయం లేకుండా పనిచేసే సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ప్రతి బంకర్‌లో 150 మంది సైనిక నాయకులు తలదాచుకునే సామర్థ్యంతో చేపట్టారు. బంకర్లు సైనిక లీడర్‌షిప్ రక్షణ, న్యూక్లియర్ కమాండ్ అవిరామ పరిచాలనలకు ఉపయోగపడతాయి. మొత్తం నిర్మాణ ఖర్చు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు.
భారతీయ దాడుల భయంతోనే..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలోని న్యూక్లియర్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. బ్రహ్మోస్ క్షిపణులు అపారమైన స్పష్టతతో పనిచేశాయి. ఈ అనుభవాల నుంచి పాడు పొందాలని పాకిస్తాన్ న్యూక్లియర్ ఆస్తులను విభజించి, డిజిటల్ కమాండ్ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.
పాకిస్తాన్‌లో సైనిక అధికారులకు, సామాన్య సైనికులకు విడిగా అధికారుల ఆసుపత్రులు ఉన్నాయి. అంటే వ్యత్యాసం చూపుతున్నాయి. ఇక తమకు తమకు ఏమీ కాకూడదని ప్రత్యేకంగా నిర్మాణలు చేసుకుంటున్నారు. తినడానికి తిండి లేకపోయినా 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.