Homeఅంతర్జాతీయంPakistan: పాకిస్తాన్‌కు మరో షాక్‌..!

Pakistan: పాకిస్తాన్‌కు మరో షాక్‌..!

Pakistan: కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరుల దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులతోపాటు దాని వెనుక ఉన్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది. పాకిస్తానీలకు వీసాలు రద్దు చేసింది. రెండు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించించింది. కొత్త వీసాలు జారీ చేయవద్దని నిర్ణయించింది. మరోవైపు ఉగ్రవాదులను గుర్తించేందుకు విస్తృతంగా సైన్యం గాలిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా పాకిస్తాన్‌ కేంద్రంగా నడుస్తున్న యూట్యూబ్‌ చానెళ్లను బ్యాన్‌ చేసింది. ఈ చానెళ్ల జాబితాలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు, ఉగ్రవాదులను ‘మిలిటెంట్లు’గా అభివర్ణించిన బీబీసీ చానళ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఈ చర్యలు జాతీయ భద్రతను బలోపేతం చేసే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు.

Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…

16 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు, పాకిస్తాన్‌ నుంచి నిర్వహించబడుతున్న 16 యూట్యూబ్‌ చానళ్లను భారత్‌లో నిషేధించారు. ఈ ఛానళ్లలో డాన్‌ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ వంటి ప్రముఖ మీడియా సంస్థలతోపాటు కొందరు జర్నలిస్టుల వ్యక్తిగత చానళ్లు కూడా ఉన్నాయి. ఈ చానళ్లు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ నిషేధం జాతీయ భద్రతను కాపాడేందుకు తీసుకున్న చర్యగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

షోయబ్‌ అక్తర్‌ చానల్‌పై వేటు
నిషేధిత యూట్యూబ్‌ ఛానళ్ల జాబితాలో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ చానల్‌ కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అక్తర్‌ చానల్‌లో క్రీడలకు సంబంధించిన కంటెంట్‌తోపాటు, భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ అంశాలపై చర్చలు ఉండటమే ఈ నిషేధానికి కారణమని భావిస్తున్నారు. ఈ చర్య అక్తర్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

బీబీసీకి నోటీసులు..
పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా బీబీసీ చా] ళ్లు ఉగ్రవాదులను ‘మిలిటెంట్లు’గా అభివర్ణించడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో బీబీసీ కథనాలు భారత భావోద్వేగాలను గాయపరిచాయని, ఉగ్రవాదాన్ని సమర్థించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు బీబీసీ రిపోర్టింగ్‌పై భారత్‌ యొక్క కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.

పాక్‌ మీడియాపై నిషేధాలు
భారత్‌ గతంలోనూ పాకిస్థాన్‌ మీడియాపై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌ సినిమాలు, ట్విట్టర్‌ ఖాతాలపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ ఆర్టిస్టులు, సినిమాలపై భారత్‌లో నిషేధం విధించబడింది. అలాగే, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పాక్‌ ట్విట్టర్‌ ఖాతాలను కూడా బ్లాక్‌ చేశారు. ఈ కొత్త యూట్యూబ్‌ నిషేధం ఆ శ్రేణిలో మరో ముందడుగుగా భావిస్తున్నారు.

యూట్యూబ్‌ ఛానళ్లలో కంటెంట్‌ బ్లాక్‌
నిషేధిత యూట్యూబ్‌ ఛానళ్లను భారత్‌లో తెరిచే ప్రయత్నం చేస్తే, ‘‘కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అనే సందేశం కనిపిస్తుంది. ఈ చర్య భారత్‌లో ఈ ఛానళ్ల ప్రభావాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఈ నిషేధం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌ సహకారంతో అమలవుతోంది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు జాతీయ భద్రతపై కేంద్రంఢసంకల్పాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల నిషేధం, బీబీసీకి నోటీసులు భారత్‌–పాక్‌ ఉద్రిక్తతల నడుమ కొత్త చర్చకు దారితీశాయి. ఈ చర్యలు దీర్ఘకాలంలో భారత్‌లో విదేశీ మీడియా ప్రభావాన్ని, ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా ఉండనుంది.

Also Read: ఏప్రిల్ 30న తెలంగాణ 10వ తరగతి ఫలితాలు? తల్లిదండ్రులకు కీలక సూచన

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular