Pakistan Afghanistan Conflict: పాకిస్తాన్‌కు రెండు వైపులా దబ్బలు తగులుతున్నాయి. ఆఫ్గానిస్తాన్‌పై సింగిల్ బ్యారెల్ గన్‌తో దాడిచేసి ఇప్పుడు డబుల్ బ్యారెల్ గన్‌తో దెబ్బలు తింటోంది. గాజా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో పాలుపంచుకుంటామని పాకిస్తాన అమెరికాకు మాట ఇచ్చింది. కానీ దానిని అమలు చేసే ఆసక్తి లేదు. అలా చేస్తే అంతర్గతంగా వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో దీనిని తప్పించుకోవడానికి ఆఫ్గానిస్తాన్‌పై దాడి మొదలు పెట్టింది. కానీ తాలిబాన్ ప్రతీకార దాడులతో లబోదిబో మంటుంది. గాజా స్థిరీకరణ బలగాల్లో చేరాలని అమెరికాకు హామీ ఇచ్చినా అమలు చేయకపోవటం, అంతర్గత వ్యతిరేకత పెరగడంతో ఆఫ్గాన్‌తో యుద్ధం మొదలు పెట్టింది. ఈ సంఘర్షణ పాకిస్తాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలకు తీవ్ర దెబ్బ తీస్తోంది.
వారం వ్యవధిలో దాడులు, ప్రతిదాడులు..
గత ఆదివారం పాకిస్తాన్ ఆఫ్గాన్ భూభాగంలో వైమానిక దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని ప్రకటించింది. అయితే సివిలియన్లు, పిల్లలు, మహిళల మరణాలు గుర్తించబడ్డాయి. మంగళవారం తాలిబాన్ సైన్యం ప్రతీకారంగా పాక్ పోస్టులను ఆక్రమించుకుంది. బుధవారం ఘర్షణ ఊపందుకుని, గురువారం పాక్ మరోసారి ఎయిర్ స్ట్రైకులు చేసింది. శుక్రవారం పాక్ గ్రౌండ్ ఆపరేషన్‌లు ప్రారంభించగా, శనివారం తాలిబాన్ కాందహార్, కాబూల్ ప్రాంతాలపై ప్రతిదాడి చేసింది. ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్ వైమానిక దళం లేకపోయినా డ్రోన్‌లతో ఇస్లామాబాద్, ఫైజాబాద్ లక్ష్యాలు చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ భారత్ వైపు మొహరించబడటంతో నష్టాలు తప్పలేదు. ఆదివారం ఖైబర్ పక్తుంఖ్వా, బలూచిస్తాన్ సైనిక స్థావరాలు, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భీకర దాడులు చేసి ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది.
అమెరికా ఒత్తిళ్లు తప్పించుకోవడానికి డైవర్షన్..
గాజా అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల్లో పాలుపంచుకుంటామని అమెరికాకు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. కానీ అంతర్గత వ్యతిరేకత భయంతో అమలు వాయిదా వేసింది. దీన్ని మరచిపోయించేందుకు ఆఫ్ఘన్‌పై దాడులు ప్రారంభించి జాతీయవాద భావనలను రేకెత్తించాలని భావించింది. ఇప్పుడు అమెరికా ఈ డైవర్షన్‌ను గుర్తించి పాక్‌పై ఒత్తిడి పెంచింది.
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసి పాకిస్తాన్‌ను ఒత్తిడికి తీసుకువచ్చింది. ఆ దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆఫ్గాన్ డ్రోన్ దాడులు జరిగాయి. ఎయిర్ డిఫెన్స్ విఫలం కావడం పాక్ సైనిక వ్యవస్థలో గందరగోళం సృష్టించింది. ఇది ఇస్లామాబాద్ విధానాల తప్పిదానికి స్పష్టమైన సూచిక.
పాకిస్తాన్ అమెరికా, ఆఫ్ఘన్ మధ్య చిక్కుకుని రెండు వైపులా దబ్బలు తినుతోంది. ఆఫ్ఘన్ పోస్టులు ఆక్రమణ, డ్రోన్ దాడులు సైనిక నష్టాలను పెంచాయి. ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మద్దతు లేకపోతే ఇస్లామాబాద్ మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.