Ocean: భూమ్మీద సప్తసముద్రాలు ఉంటాయని.. భూగర్భంలో జలాలు ఉంటాయని.. వర్షం పడినప్పుడు నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలంగా మారుతుందని.. ఆ భూగర్భ జలమే మనుషుల మనుగడకు ఆధారమని చదువుకున్నాం. అయితే ఇప్పుడు తాజా అధ్యయనంలో భూ అంతర్భాగంలోనూ ఒక సముద్రం ఉందని తేలింది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో సముద్రం ఉందని తెలియ రాలేదు. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని ఇవాన్ స్టన్ ప్రాంతంలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూగర్భ జలాల మూలాలపై కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భూ అంతర్భాగం కింద విస్తారమైన నీటి నిల్వలను కనుగొన్నారు 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సముద్రం విస్తరించి ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
భూ అంతర్భాగంలో నీటి మూలాలు తెలుసుకునేందుకు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వారి పరిశోధనలలో భూ అంతర్భాగం అడుగున పెద్ద సముద్రం ఉందని తేలింది. భూమికి సంబంధించి అంతర్భాగంలో ఇది విస్తరించి ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. 2014లో డీహైడ్రేషన్ మెల్టింగ్ అనే అధ్యయనంలో ఈ విషయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ అంతర్భాగంలో 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రం నిక్షిప్తమై ఉంది. దీనిని శాస్త్రవేత్తలు రింగ్ వుడైట్ అని పిలుస్తున్నారు. చుట్టూ నీలం రాతి భాగం మధ్యలో సముద్రం దాగి ఉంది.. భూ ఉపరితలాన్ని భూ భౌగోళిక శాస్త్రవేత్తలు వారి పరిభాషలో మాంటిల్ అని పిలుస్తారు. ఈ మాంటిల్ కు మధ్యలో వేడి రాతి పొర ఉంటుంది. అదే సముద్రం నుంచి భూ ఉపరితలాన్ని రక్షిస్తోంది. అది గనక లేకుంటే భూగర్భంలో విస్తరించి ఉన్న సముద్రం తాకిడికి ఉపరితలం కుంగిపోతుంది. భూమి ఏర్పడే క్రమంలో.. భూమి లోపల నుంచి మహాసముద్రాలు క్రమంగా బయటికి వచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో భూ అంతర్భాగంలో సముద్రం ఉన్నట్టు తేలడంతో.. సముద్రాల ఏర్పాటుపై ఒక స్పష్టతకు వచ్చారు. అయితే భూ అంతర్భాగంలో ఉన్న సముద్రం.. భూమి మీద ఉన్న మహా సముద్రాల పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది..” భూ ఉపరితలం నుంచి సముద్రాలు ఉద్భవించాయని ఇప్పుడు కచ్చితంగా చెప్పగలం. గతంలో ఇదొక వాదనగానే ఉండేది. భూ అంతర్భాగంలో సముద్రం ఉన్న నేపథ్యంలో.. మా పరిశోధనలకు బలం ఏర్పడిందని” నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త స్టీవెన్ జాకబ్ సన్ అన్నారు.
జాకబ్ సన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం 2016లో దాదాపు 2000 సిస్మోమీటర్లు ఉపయోగించి 500 కు పైగా భూకంపాల నుంచి వచ్చిన తరంగాలను విశ్లేషించింది. ఈ తరంగాలు భూమి అంతర్భాగంలో ప్రయాణించి.. భూ కేంద్రాన్ని చేరుకున్న అనంతరం.. భూ అంతర్భాగం వద్ద వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి ద్వారా భూ అంతర్భాగంలో సముద్రం ఉనికిని కనుగొన్నారు. వివిధ లోతుల వద్ద తరంగ వేగాన్ని కొలిచి.. వారు భూ అంతర్భాగంలో ఉన్న రాతి రకాలను గుర్తించారు. ఈ సమయంలో వారికి తేమగా ఉన్న రాతినేల కనిపించింది. అక్కడ సముద్రపు అలల ఉనికి వారికి స్పష్టమైంది. ” ఇలా సముద్రం భూ అంతర్భాగంలో ఉండటంవల్ల భూమి అనేది ఆవాస యోగ్యంగా మారింది. లేకుంటే భూమి మొత్తం సముద్రపు నీటితో నిండి ఉండేది. కేవలం పర్వత శిఖరాలు మాత్రమే కనిపించేవని” జాకబ్ సన్ అన్నారు. అయితే శాస్త్రవేత్తల బృందం భూగర్భంలో దాగివున్న సముద్రం గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది. ఇదొక్కటేనా, భూ అంతర్భాగంలో ఇంకా సముద్రాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై పరిశోధనలు సాగిస్తోంది.