https://oktelugu.com/

EU Visa – Indians : ఇండియన్స్ కు సలాం చేయాల్సిందే.. ఈయూ కూడా దిగొచ్చింది

అవి బెల్జియం, బల్గేరియా, క్రొయోషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, ఎస్టోనియా, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, లాట్వియా, లితువేనియా, లక్సెమ్ బర్గ్, హంగరి, మాల్టా, నెదర్లాండ్, ఆస్ట్రియా, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్లోవేకియా, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, రిచ్ టెన్ స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ వాటి దేశాలు ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2024 / 09:48 PM IST

    New Shenzhen visa rules granted to Indians by EU

    Follow us on

    EU Visa – Indians : భారతీయులకు మరో దేశం సలాం చేసింది. సోమవారం 66 వేల మంది భారతీయులకు శాశ్వత పౌరసత్వం ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించిన కొంత సేపటికే.. యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఐరోపా ఖండంలో నివసించే భారతీయులకు వీసా కష్టాలు తీరినట్టే.. అంతేకాదు వారు ఎక్కువ చెల్లుబాటయ్యే బహుళ ప్రవేశ ( లాంగ్ వాలిడిటీ) స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కనుక అమల్లోకి వస్తే దీర్ఘకాలం పాటు యూరోపియన్ యూనియన్ దేశాలలో ఉంటున్న భారతీయులకు వెసలు బాటు లభిస్తుంది. అదే కాదు “కొత్త వీసా క్యాస్కెడ్ విధానం, పాస్ పోర్ట్ చెల్లుబాటును కనుక అనుమతిస్తే భారతీయులకు దీర్ఘకాలం ఉండే అవకాశం లభిస్తుంది.

    యూరోపియన్ యూనియన్ కమిషన్ ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు బహుళ ప్రవేశ వీసాల గారికి సంబంధించి పలు నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. గతంలో ఉన్న నిబంధనలను సరళతర చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా కోడ్ లో చాలా మార్పులు చేసింది.. యూరోపియన్ యూనియన్ ఆమోదించిన ప్రామాణిక నిబంధనలు సరళతరం కావడం భారతీయులకు లాభిస్తుంది. యూరోపియన్ యూనియన్ తీసుకున్న క్యాస్కేడ్ నిబంధన ప్రకారం భారతీయ పౌరులకు దీర్ఘకాలిక, బహుళ ప్రవేశ స్కెంజెన్ వీసాలను జారీ చేస్తారు. గత మూడేళ్లలో రెండు వీసాలను పొంది, వాటిని చట్టబద్ధంగా ఉపయోగించినప్పటికీ.. వాటి కాలపరిమితి మరో రెండు సంవత్సరాల దాకా ఉంటుంది. ఒకవేళ పాస్ పోర్ట్ కు తగినంత వ్యాలిడిటీ ఉంటే.. రెండు సంవత్సరాల వీసా పరిమితి ఐదేళ్లకు పెరుగుతుంది. ఈ వ్యాధిలో వీసా ఉన్నవారు.. యూరోపియన్ యూనియన్ జాతీయులతో సమానంగా ప్రయాణ హక్కులు పొందుతారు.

    యూరోపియన్ యూనియన్ దేశాల అభివృద్ధిలో భారతీయులు కీలకంగా పనిచేస్తుండడం వల్ల.. ఇటీవల మైగ్రేషన్ విధానం పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వలస, ఇతర చట్టాలపై సమీక్ష నిర్వహించారు. అందువల్ల యూరోపియన్ యూనియన్ వీసా నిబంధనలను సరళ తరం చేసింది. స్కెంజెన్ వీసాల ద్వారా 180 రోజుల వ్యవధిలో గరిష్టంగా 90 రోజులపాటు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ వీసాలు ఇతర ఇతర ప్రయోజనాలు అందించవు. స్కెంజెన్ ప్రాంత పరిధిలో 29 యూరోపియన్ దేశాలు ఉన్నాయి. అవి బెల్జియం, బల్గేరియా, క్రొయోషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, ఎస్టోనియా, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, లాట్వియా, లితువేనియా, లక్సెమ్ బర్గ్, హంగరి, మాల్టా, నెదర్లాండ్, ఆస్ట్రియా, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్లోవేకియా, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, రిచ్ టెన్ స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ వాటి దేశాలు ఉన్నాయి.