https://oktelugu.com/

Puri Jagannath : మరో సంచలన విషయాన్ని రివీల్ చేసి షాక్ ఇచ్చిన పూరి

ఇక ఇలాంటి వాళ్లు భారతదేశ ఆర్మీ సైన్యంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం వచ్చిన దృఢ సంకల్పం ఎదుర్కోవడానికి ఎప్పుడు ముందుంటారు. ఇక చైనీస్, జపనీస్, కొరియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎలాంటి ఇబ్బందులను అయిన ఎదురించి వాళ్ళు టాప్ లో ఉండే లాగా పోరాటం చేస్తు ఉంటారు...

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2024 / 10:05 PM IST

    Puri Jagannath

    Follow us on

    Puri Jagannath : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్… ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక కరోనా లాక్ డౌన్ నుంచి ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో యూట్యూబ్ లో కొన్ని ఆడియోలు పెడుతూ ఎప్పటికప్పుడు తన అభిమానులను మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఈసారి చైనీస్, జపనీస్ గురించి చాలా డీప్ గా మాట్లాడాడు…

    పురాతన కాలం లో మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వస్తు బతికేవారు. ఇక అలాంటి సమయంలో కొంతమంది యూరప్ కి వెళ్లి సెటిలైతే, మరి కొంతమంది ఇండియాకి వచ్చి సెట్ అయ్యారు. మరికొంత మంది హిమాలయాలకు వెళ్లి కొన్ని వందల సంవత్సరాల పాటు మంచు కొండలను ఎక్కే ప్రయత్నం చేస్తూ అక్కడే జంతువులతో పోరాటం చేస్తూ బ్రతికారు. ఇక వాళ్ళు చలిని తట్టుకోవడానికి జంతువుల చర్మాన్ని వలచి దుస్తులుగా ధరించారు. ఇక మంచులో పౌష్టికహారం దొరక్కపోవడం తో వాళ్ల ఎముకల్లో ఎదుగుదల లోపించి పొట్టి గా తయారయ్యారు.

    మంచుకొండల్లో సూర్యుడు లేక వాళ్ళు కండ్లు చిన్నవి చేసుకొని చూడడం స్టార్ట్ చేశారు. దానివల్ల కాలక్రమేణా వాళ్ల కండ్లు చిన్నవిగా తయారయ్యాయి. దీన్నే ‘ఎపికాంథిక్ ఫోల్డ్ ‘ అంటారు. అలా క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి పొట్టిగా, కండ్లతో సరిగ్గా చూడ లేకుండా చిన్నవిగా చేసుకొని చూడటంతో కొద్ది సంవత్సరాలకి అలాంటి ఒక జాతి తయారైంది. కాలక్రమేణా వాళ్లు హిమాలయాల నుంచి బయటకు వచ్చేసి స్థిరపడ్డారు. వాళ్లే చైనీస్, జపనీస్, కొరియన్స్…

    ఇక ఇది ఇలా ఉంటే ఇండియాకు వచ్చి అడవుల్లో నివసిస్తూ, జంతువులను వెంటాడుతూ సూర్యడు ఎండ ను బాగా ఆస్వాదిస్తూ, కండ్లు పెద్దవిగా చేసి చూస్తూ కొంత మంది బతికారు. అయితే ‘ఎపికాంథిక్ ఫోల్డ్’ ఉన్న మనుషులు చాలా బలవంతులు, ఇక వాళ్ళ డిఎన్ఎ మారిపోయింది. కఠినమైన పరిస్థితులను జయించి మనం బతకాలి అనేది వాళ్లకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఫిజికల్ గా గాని, మెంటల్ గా గాని చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకోసమే ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కోవడానికి సిద్దం గా ఉండాలి.

    ఇక ఇలాంటి వాళ్లు భారతదేశ ఆర్మీ సైన్యంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం వచ్చిన దృఢ సంకల్పం ఎదుర్కోవడానికి ఎప్పుడు ముందుంటారు. ఇక చైనీస్, జపనీస్, కొరియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎలాంటి ఇబ్బందులను అయిన ఎదురించి వాళ్ళు టాప్ లో ఉండే లాగా పోరాటం చేస్తు ఉంటారు…