Russia Ukraine War: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లకుపైగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని రష్యా యత్నిస్తోంది. అమెరికా తమ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ కూడా అమెరికావైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో యుద్ధం మొదలైంది. మొదట్లో రష్యా ఉక్రెయిన్‌పై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే అమెరికా, నాటో దేశాల అండతో ఉక్రెయిన్ కూడా ఎదరుదాడి మొదలు పెట్టింది. దీంతో ఇరువైపులా తీవ్ర నష్టం జరిగింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలతోపాటు ఆర్థికసాయం చేస్తోంది. దీంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో రష్యాపై దాడులు పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు సూచించారు. ఉక్రెయిన్ నుంచి వేలాదిగా సైనికులు రష్యాకు మద్దతుగా కదనరంగంలోకి దిగారు. దీంతో అమెరికా ఉక్రెయిన్‌ను మరింత ఉసిగొల్పుతోంది. లాంగ్ రేంజ్ మిసైళ్లపై ఇప్పటి వరకు పరిమితి విధించిన అమెరికా ఇప్పుడు దానిని ఎత్తేసింది. తన పదవీకాలం ముగిసేలోగా యుద్ధం ముగించాలనే ఉద్దేశంతో బైడెన్ ఉక్రెయిన్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో యుద్దం భీరకం అవుతుందని విశ్లేషకుల భావిస్తున్నారు.
నాటో దేశాల అప్రమత్తం..
యుద్ధం తీవ్రం అయ్యే సంకేతాలు రావడంతో నాటో దేశాలు అప్రమత్తం అయ్యాయి. తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి. తాజాగా స్వీడన్, ఫిన్‌లాండ్ ప్రజలకు అవసరమైన సూచనలు చేశాయి. యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్ సరఫరా ఆగిపోతే ఎలా స్పందించాలో తెలియజేశాయి. ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరాయి. దీంతో ప్రజలను కూడా అప్రమత్తం చేశాయి.
ఆహారం నిల్వ పెట్టుకోవాలి..
యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వాటర్ బాటిళ్లు, స్టేషనరీ, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవాలని సూచించాయి. యుద్ధ సమయంలో తాము ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు తెలియజేస్తోంది. పిల్లల పేరెంట్స్, సంరక్షకులు కచ్చితంగా డైవప్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలు స్టాక్ పెట్టుకోవాలని సూచించాయి.
యుద్ధం వస్తే..
ఒకవేళ యుద్ధం వస్తే.. అనే పేరుతో స్వీడన్ ప్రభుత్వం 50 లక్షల బక్‌లెట్లను వచ్చే రెండు వారాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇలాంటి బుక్లెట్లను పంచడం ఇది ఐదోసారి. సోమవారం విడుదల చేయగా దీనిని ఇప్పటికే 55 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రపంచంలో పరస్థితులు కొన్నేళుల్గా మారుతున్నాయి. మనకు సమీపంలోనే యుద్ధం జరుగుతోంది. టెర్రర్, సైబరన్ తప్పుడు సమాచారం ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
ఫిన్‌లాండ్ కూడా.
ఇక ఫిన్‌లాండ్ కూడా ఇలాంటి కరపత్రాలనే ప్రింట్ చేయిస్తోంది. వాటిని ప్రనజలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ దేశంలో 58 శాతం మంది ప్రజలు యుద్ధం వస్తే తట్టుకునేలా నిత్యావసర సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని సూచించింది. నార్వే కూడా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేయడానికి 22 లక్షల బుక్‌లెట్లు విడుదల చేసింది.
ప్రతిదాడికి రష్యా సిద్ధం..
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ దాడులను తిప్ప కొట్టడంతోపాటు ప్రతిదాడి చేయాలని రష్యా భావిస్తోంది. ఈ క్రమం పుతిన్ సైన్యాన్ని అలర్ట్ చేశారు. ఉత్తర కొరియా సైనికులకు కూడా లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. ఉక్రెయిన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు.