Russia: నాటో దేశాల గ్యాస్ అవసరాలు రష్యా తీర్చుతోంది. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. కూరగాయలు, పాలు, పండ్లు, ఖనిజాల వంటి ఎగుమతిని కూడా ఆపేసింది. ఇది సహజంగానే నాటో దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. బహిరంగంగా ఉక్రెయిన్ దేశానికి మద్దతు పలుకుతున్నప్పటికీ.. ఆ దేశాలలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతవస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి నాటో దేశాలది. అందువల్లే యుద్ధం త్వరగా ముగిసిపోవాలని ఆ దేశాలు కోరుకుంటున్నప్పటికీ.. పరిస్థితులు అలాగ లేవు. పైగా బైడన్ ఉక్రెయిన్ కు మద్దతు పలకడంతో.. అది అత్యంత ఆధునిక ఆయుధాలతో రష్యాపై దాడులు చేస్తోంది. రష్యా కూడా న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పుతిన్ వీటికి పచ్చ జెండా ఊపారని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ న్యూక్లియర్ ఆయుధాలతో రష్యా యుద్ధం చేస్తే ఉక్రెయిన్ మాత్రమే కాదు నాటో దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యం వల్ల ఆ దేశాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికంగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఉపాధి కల్పన ప్రభుత్వ లకు చాలా ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా న్యూక్లియర్ ఆయుధాలతో రెచ్చిపోతే అది నాటో దేశాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతుంది. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు నాటో దేశాలు ముందుండి నడిచాయి. ఉక్రెయిన్ దేశానికి అండగా నిలిచాయి. ఆ తర్వాత తప్పుకున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యాతో తలపడలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. మధ్యలో అమెరికా గనుక సపోర్ట్ చేయకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో చేతులెత్తేసేది. ఇప్పుడు తాజాగా అమెరికా మళ్లీ సపోర్ట్ ఇవ్వడంతో అత్యాధునిక ఆయుధాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. అయితే ఇది ఎంతవరకు సాగుతుందనేది ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.
నాటో దేశాలు భయపడుతున్నాయి
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. నాటో పరిధిలో ఉన్న నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు తమ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం మొదలుపెట్టాయి. యుద్ధం వల్ల సంక్షేమం అనేది తలెత్తితే.. దానిని ఎలా ఎదుర్కోవాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలను భద్రపరచుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. స్వీడన్ దేశంలో ప్రజలకు అక్కడి ప్రభుత్వం లక్షల్లో బుక్లెట్లు పంచింది..యుద్ధాన్ని.. దానివల్ల ఎదురవుతున్న సంక్షేపాన్ని ఎదుర్కోవడానికి ఫిన్లాండ్ దేశం ప్రజల సౌకర్యార్థం కొత్త వెబ్ సైట్ ప్రారంభించింది. యుద్ధం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన జాగ్రత్తలను అందులో వివరించింది. నార్వే ప్రభుత్వం కూడా కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. యుద్ధం ఎదురైనా లేదా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వారం పాటు రెడీగా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఆ కరపత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nato countries are trembling in front of russias aggression what will stand by ukraine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com