https://oktelugu.com/

అంగారకుడి నుంచి మార్స్‌ ఛాయా చిత్రాలు..: ఆశ్చర్యపోతున్న నాసా సైంటిస్టులు

అంగారక గ్రహంపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు.. అక్కడి వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు చేసిన అధ్యయనం మరోసారి సక్సెస్‌ అయింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ పర్సెవరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మార్స్ రోవర్ నుంచి అద్భుతమైన ఛాయాచిత్రాలు నాసాకు అందాయి. అంగారకుడి ఉపరితలానికి సంబంధించిన ఛాయా చిత్రాలు ఉండగా.. మార్స్ రోవర్ అంగారకుడిపై ల్యాండ్ అవుతున్న ఛాయాచిత్రం కూడా పంపించడం విశేషం. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2021 / 02:44 PM IST
    Follow us on


    అంగారక గ్రహంపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు.. అక్కడి వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు చేసిన అధ్యయనం మరోసారి సక్సెస్‌ అయింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ పర్సెవరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మార్స్ రోవర్ నుంచి అద్భుతమైన ఛాయాచిత్రాలు నాసాకు అందాయి.

    అంగారకుడి ఉపరితలానికి సంబంధించిన ఛాయా చిత్రాలు ఉండగా.. మార్స్ రోవర్ అంగారకుడిపై ల్యాండ్ అవుతున్న ఛాయాచిత్రం కూడా పంపించడం విశేషం. ఆ అద్భుతమైన ఛాయా చిత్రాన్ని చూసి తాము అబ్బురపడ్డామని, ఒకరకంగా విజయం సాధించేశామన్న భావన కలిగిందని నాసా శాస్త్రవేత్త పౌలిన్ వాంగ్ తెలిపారు. మార్స్ రోవర్‌లోని బూస్టర్ రాకెట్,స్కై క్రేన్ సిస్టమ్ ద్వారా ఆ ఛాయాచిత్రం సాధ్యపడిందన్నారు. మరోవైపు అంగారక ఉపరితలానికి కేవలం ఆరడుగులు(2మీ.) ఎత్తులో ఆ ఛాయాచిత్రాన్ని మార్స్ రోవర్ క్యాప్చర్ చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్స్ పర్సెవరెన్స్ రోవర్ అంగారక ఉపరితలంపై సురక్షితంగా ఉందని.. మున్ముందు మరిన్ని అద్భుతమైన ఛాయా చిత్రాలు వస్తాయని అంటున్నారు.

    భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు, సూక్ష్మజీవుల శిలాజాలు, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు 7 నెలల క్రితమే ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు మార్స్ రోవర్ శుక్రవారం కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువైంది. అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయి అంతరిక్ష నౌక నుంచి విడిపోయింది. ఈ ప్రయోగానికి నాసా 2.4 బిలియన్ డాలర్లు (దాదాపు 17వేల కోట్లు) ఖర్చు చేసింది. మార్స్‌ రోవర్‌‌తోపాటు పర్సవరెన్స్ రోబో తీసిన ఫొటోలనే తాజాగా నాసా విడుదల చేసింది.