NASA: స్కైలాబ్.. ఈ పేరు గుర్తుందా? 1980కి ముందు పుట్టిన వారికి దీనిపై అవగాహన ఉంది. స్కైలాబ్ ఉపగ్రహం కూడా నాసా అంతరిక్షంలోకి పంపిందే. 1970వ దశకంలో రష్యా, అమెరికాల మధ్య స్పేస్ టెక్నాలజీ విఝయంలో పోటీ ఉండేది. ఈ క్రమంలో రష్యా స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. అమెరికా కూడా స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూర్యునిపై పరిశోధనలు చేయాలని 1973, మే 14 స్కైలాబ్ ను అంతరిక్షంలోకి పంపింది. ఐదేళ్ల తర్వాత అది కక్ష్యలోకి వెళ్తుందని నాసా అంచనా వేసింది. కానీ స్కైలాబ్ క్రమంగా కక్షను కోల్పోతూ వచ్చింది. దీంతో స్కైలాబ్ 1979నాటికి భూమిపై పడుతుందని నాసా ప్రకటించింది. దీంతో నాడు జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. చావు తప్పదని భావించారు. కానీ అది హిందూ మహాసముద్రంలో పడడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. అయితే ఇప్పుడు సముద్రంలో కాకుండా గ్రహశకలాన్ని తిరిగి కక్షలోకి పంపే ప్రయత్నంలో నాసా విజయవంతమైంది.

దూసుకొస్తున్న డైమోర్ఫస్‌ను.. డైవర్ట్ చేసింది..
భూమిపైకి దూసుకొచ్చిన గ్రహశకలాన్ని నాసా ఏ రకంగా ధ్వంసం చేస్తుందనే కథాంశంతో రూపొందించిన హాలీవుడ్ మూవీ– ఆర్మగెడాన్. బ్రూస్ విల్లీస్ హీరో. 1998లో వచ్చిన ఈ మూవీని నాసా ఇప్పుడు నిజం చేసింది. భూమిపైకి దూసుకొస్తోన్న ఓ గ్రహశకలం డైమోర్ఫస్‌ను నాసా ప్రయోగించిన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ ఢీ కొట్టింది. దాని దిశను మార్చివేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాసా విడుదల చేసింది.
1,260 పౌండ్ల బరువు..
1,260 పౌండ్ల బరువు ఉన్న డబుల్ ఆస్టరాయిడ్ రీ–డైరెక్షన్ టెస్ట్(డార్ట్) స్పేస్‌క్రాఫ్ట్ సెప్టెంబర్ 27 తెల్లవారు జామున 4:40 నిమిషాలకు ఆ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది. భూ ఉపరితలం నుంచి ఏడు మిలియన్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంటకు 14,000 మైళ్ల వేగంతో ఆ స్పేస్‌క్రాఫ్ట్ డైమోర్ఫస్ అస్టరాయిడ్‌ను ఢీకొట్టింది. ఈ గ్రహశకలం బరువు 11 బిలియన్ పౌండ్లు. 520 అడుగుల పొడవు ఉండే ఈ అస్టరాయిడ్ సెంటర్ పాయింట్‌కు దాదాపు 55 అడుగుల దూరంలో గల ప్రాంతాన్ని నాసా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టింది.
ప్రయోగం.. సక్సెస్
ఈ మిషన్ మొత్తాన్నీ కెమెరాలో బంధించింది నాసా. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫొటోలు తీయడానికి అంతరిక్ష నౌకకు షూబాక్స్ సైజులో కెమెరాను అమర్చింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు నాసా ప్రకటించింది. తాము ఇంతకు ముందు ఎప్పుడూ లేవివిధంగా చిన్న గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి చేసిన ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించింది. అంతులేని విశ్వంలో వేల కిలోమీటర్ల వేగంతో తిరుగాడే ఓ చిన్న గ్రహశకలాన్ని ఢీకొట్టాలనుకోవడం సంక్లిష్టమే అయినప్పటికీ.. దానిని సాధించామని నాసా ప్రకటించింది.
10 నెలల ప్రయాణం..
గ్రహశకలం నిర్దేశిత స్థానంలో ఢీ కొట్టడం కష్టతరమైనప్పటికీ– ఆ లక్ష్యాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్లానెటరీ శాస్త్రవేత్త, డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ టీమ్ లీడర్ న్యాన్సీ చాబోట్ చెప్పారు. గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందనే విషయాన్ని నాసా ఇదివరకే పసిగట్టింది. ఆ తరువాత ఈ డార్ట్ మిషన్ చేపట్టింది. 10 నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ స్పేస్ క్రాఫ్ట్ తన లక్ష్యాన్ని ఛేదించింది.
325 మిలియన్ డాలర్ల ఖర్చు..
గ్రహశకలం దిశ మార్చడానికి నాసా 325 డాలర్లు ఖర్చు చేసింది. దీన్ని ఢీ కొట్టడం ద్వారా డైమోర్ఫస్‌ను 65803 డిడిమోస్ అనే మరో భారీ గ్రహశకలం కక్ష్యలోకి దీన్ని తీసుకెళ్తుంది. ఫలితంగా అది డిడిమోస్ కక్ష్యలోనే సంచరిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా భూమికి డైమోర్ఫస్ నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ మిష¯Œ ద్వారా కొన్ని కొత్త ఆవిష్కరణలను కనుగొన్నట్లు నాసా పేర్కొంది. భవిష్యత్‌లో భూమి వైపునకు దూసుకొచ్చే గ్రహశకలాల దిశను మార్చడానికి ఈ ప్రయోగంతో శ్రీకారం చుట్టినట్లయిందని తెలిపింది.
అస్టరాయిడ్ల నుంచి
ఈ ప్రయోగంతో అస్టరాయిడ్ల నుంచి భూమిని ఎలా రక్షించుకోవాలనే విషయంపై స్పష్టత వచ్చిందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. అస్టరాయిడ్ల దాడి నుంచి భూమిని రక్షించుకోవడం ఇక సాధ్యమేనని చెప్పారు. డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ డైమోర్ఫస్ అస్టరాయిడ్‌ను ఢీ కొట్టినప్పుడు వెలువడిన శక్తి, ఇతర ప్రభావాల గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని, దీనికోసం కొన్ని వారాలు లేదా నెలలు పట్టొచ్చని మిషన్ సిస్టమ్స్ ఇంజినీర్ ఎలెనా ఆడమ్స్ తెలిపారు.

డిడిమోస్ కక్ష్యలో..
రెండు నెలల్లోగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. గ్రహశకలాన్ని నాశనం చేయాలనేది తమ లక్ష్యం కాదని, డైమోర్ఫస్‌ను డిడిమోస్ చుట్టూ, దాని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని మొదటే నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల డైమార్ఫస్, డిడిమోస్ గ్రహశకలాల కక్ష్య వేగం మారిందని చెప్పారు. డిడిమోస్ ఒక కక్ష్యను 11 గంటల 55 నిమిషాలలో పూర్తి చేస్తుండేదని, స్పేస్ క్రాఫ్ట్ ఢీ కొట్టిన తాకిడికి దాని కక్ష్యను 10 నిమిషాలు తగ్గిస్తుందని అంచనా వేస్తోన్నట్లు నాసా వెల్లడించింది.
Also Read: BJP- NTR Health University: ఎన్టీఆర్ పేరుపై వివాదంలో బీజేపీకి ఎదుకంత హుషారు?