Narendra Modi
Narendra Modi: భారత్ మరియు థాయ్‌లాండ్ మధ్య లోతైన సాంస్కృతిక(Tredinal) బంధాన్ని ప్రతిబింబించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narnedra Modi) బ్యాంగ్‌కాక్(Bankak)కు చేరుకున్నప్పుడు, భారతీయ సంతతికి చెందిన వారు ‘మోదీ మోదీ‘, ‘వందే మాతరం‘ నినాదాలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. థాయ్‌లాండ్ ఉప ప్రధానమంత్రి సురియా జుంగ్రుంగ్రేంగ్‌కిట్, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఆయనను ఆహ్వానించారు. హోటల్‌కు చేరుకున్నప్పుడు, గుజరాత్(Gujarath)కు చెందిన సాంప్రదాయ గర్బా నృత్య(Garbha Dance) ప్రదర్శనతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సిక్కు, గఢ్‌వాలీ, గుజరాతీ సమాజాల ప్రజలు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read: పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ.. వర్మ పేరుతో టిడిపి రచ్చ!
ఈ సందర్భంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం రామాయణం(Ramayanam) యొక్క థాయ్ వెర్షన్ ‘రామకియన్‘ ప్రదర్శన. ఈ మనోహరమైన నృత్య ప్రదర్శనలో భారతదేశ శాస్త్రీయ భరతనాట్యం మరియు థాయ్‌లాండ్ సంప్రదాయ ‘ఖోన్‘ నృత్యం కలగలిసి, రెండు దేశాల సాంస్కృతిక సమ్మేళనాన్ని అద్భుతంగా ప్రదర్శించాయి.
2 వేల ఏళ్ల సాంస్కృతిక బంధం..
ఈ కార్యక్రమం భారత్–థాయ్‌లాండ్ మధ్య దాదాపు రెండు వేల సంవత్సరాల సాంస్కృతిక సంబంధాన్ని గుర్తు చేసింది. బౌద్ధమతం, వైదిక సంప్రదాయాలు, రామాయణం వంటి భారతీయ ప్రభావాలు థాయ్ సంస్కృతిని ఎంతగానో ఆకృతి చేశాయి. థాయ్‌లాండ్‌లో రాముడిని ‘ఫ్రా రామ్’ అని పిలుస్తారు. ఈ కథ ఆ దేశంలో లోతుగా పాతుకుపోయింది.
ముగ్ధుడైన మోదీ..
మోదీ ఈ ప్రదర్శనను ‘సాంస్కృతిక సంబంధాలకు అసమానమైన ఉదాహరణ‘గా అభివర్ణించారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న బలమైన నాగరిక సంబంధాలను సుస్పష్టం చేసింది. 6వ BIMSTEC సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ రెండు రోజుల పర్యటనకు థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడ ప్రాంతీయ సహకారంపై చర్చలు జరుగుతాయి. ఈ సంఘటన బ్యాంగ్‌కాక్‌లో భారతీయ సమాజంతో సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, రామాయణం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక వారసత్వాన్ని ఉద్ఘాటించింది.
Highlights from Bangkok…a vibrant welcome, community connect and the Ramayan! pic.twitter.com/cPyqQ1urVX
— Narendra Modi (@narendramodi) April 3, 2025