Matheesha Pathirana: జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే కొందరు కృషి, పట్టుదలతో ముందుకు వెళ్లడం ద్వారా అనుకున్నది సాధిస్తారు. అంతేకాకుండా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలో ఒక రంగంలో ఉండాలని కోరుకుంటారు. కానీ పిల్లలు మాత్రం ఇతర రంగంలో రాణిస్తారు. ఈ కోవకు చెందినదే మతీశా పతిరన స్టోరీ. శ్రీలంకకు చెందిన ఈ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ లో రాణిస్తున్నాడు. అయితే ఈయన వెనుక ధోని ఉన్నాడన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అసలు ఈయన స్టోరీ లోకి వెళ్తె..
Also Read: ఈ ముగ్గురికి ఏమైంది.. మరీ సింగిల్ డిజిటా?
శ్రీలంకలోని కాండిలో సంగీతం నేర్పరులు ఉన్న కుటుంబంలో చిన్నవాడు మతీశా పతిరన. తల్లిదండ్రులు అనురా, షైలికాలు. వీరు సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యులు. దీంతో మతీశా కూడా మ్యూజిషియన్ కావాలని అనుకున్నాడు. కానీ తల్లి మాత్రం మతీశా ఫైలట్ కావాలని అనుకుంది. అంతేకాకుండా తన కుమారుడు ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరుకుంది. అయితే పతిరన మాత్రం అటు కుటుంబ రంగంపై కాకుండా.. ఆటు తల్లి కోరికపై కాకుండా ఆటలపై దృష్టి పెట్టారు. వాస్తవానికి తాను ఏడో తరగతి వచ్చేసరికి క్రికెట్ గురించి తెలియదు. దీంతో అతడు అంతకుముందు బేస్ బాల్ పై దృష్టి పెట్టాడు.
కానీ ఒకసారి పతిరన క్రికెట్ ఆడడం చూసి సీనియర్లు ఈ ఆటపై దృష్టి పెట్టాలని, ఇందులో రాణిస్తావని చెప్పారు. దీంతో క్రెకెట్ పై ఫోకస్ పెట్టిన అతడు చదువును మధ్యలోనే మానేశాడు. అయితే తమ కుమారుడి భవిష్యత్ గురించి భయపడిన తల్లిదండ్రులు అతడిని శ్రీలంకలోని ట్రినిటీ కళాశాలలో చేర్పించాలని అనుకున్నారు. అయితే ప్రాథమిక స్థాయితో పతిరన ఆడిన కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో అండర్ 19లో అవకాశం వచ్చింది. దీంతో అందరి దృష్టి పతిరన మీద పడింది. దీంతో అబుదాబి టీ 10 టోర్నీలో పతిరన తన ప్రతిభ చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నెట్ ప్రాక్టిస్ కోసం ఎంపిక అయ్యాడు.
అయితే చెన్నైలో సభ్యుడిగా ఉన్న మతీశ్ గురించి పూర్తిగా ఆరా తీసిన తరువాత ఈ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఐపీఎల్ 2022 సీజన్ లో న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో మతీశ్ పతిరనను తీసుకునన్నారు. అ ఆ తరువాత ధోనీ మార్గంలో వెళుతూ స్టార్ గా ఎదిగారు. అయితే తాను ధోని ని తన తండ్రిలాగా భావిస్తానని పతిరన్ చెబుతూ ఉంటారు. నా క్రికెట్ కెరీర్ కు ధోనినే మార్గదర్శి అని అంటూ ఉంటారు. కేవలం ప్రతిభ ఆధారంగానే మాత్రం ఎంపిక అయ్యే క్రికెట్ లో ఎంతో మంది ఇలాంటి వారు ఉన్నారు. కానీ తల్లిదండ్రులను కాదని తనకు నచ్చిన రంగంలో స్టార్ గా మారిన ఈ యువకుడిని చూసి ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న మతీశ్ పతిరన ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం..