పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏనాడో చెప్పారు. నంది కడుపులో పంది పుడుతుందని ఆనాడే తన పుస్తకంలో రాశారు. అది అక్షరాలా నిజమైంది. కానీ ఈ ఘటన జరిగింది మనదేశంలో మాత్రం కాదు. రష్యాలో చోటుచేసుకుంది. ఖర్కాసియాలోని మెట్కెచిక్ అనే గ్రామంలో ఈ వింత చోటుచేసుకోవడం గమనార్హం. అప్పుడప్పుడు ఇలాంటి వింత ఆకారాలు పుడుతూనే ఉంటాయి. కానీ ఆవు కడుపులో అచ్చం పందిని పోలిన ఆకారం పుట్టడం యాదృచ్ఛికమేమీ కాదు. అనుకోకుండా జరిగింది కూడా కాదనే తెలుస్తోంది.

ఓ ఆవుకు వింత దూడ జన్మించడంతో ఊరంతా వచ్చి చూశారు. ఈ విషయాన్ని రైతు అందరికి చెప్పాడు. పుట్టిన దూడకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమంలో పెట్టాడు. దీంతో అది కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. నంది కడుపులో పంది పుట్టడం ఏమిటని అందరు ఆశ్చర్యపోతున్నారు. కలియుగ అంతం అప్పుడే వస్తుందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
పుట్టిన దూడకు వెంట్రుకలు లేకుండా రెండు తలలు మాత్రం ఉన్నాయి. రెండు నాలుకలు ఉన్నాయి. పంది లాగా కాళ్లు చిన్నవిగా ఉన్నాయి. గులాబీ రంగులో ఉంది. దూడలా కాకుండా పందిని పోలినట్లుగానే ఉంది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే దూడ పుట్టే ముందు ఆవు ఏడు గంటల పాటు నరకయాతన అనుభవించిందట. కానీ పుట్టిన కాసేపటికే దూడ చనిపోయింది. ఆవు కూడా కొన్ని రోజులకు ప్రాణాలు విడవడం గమనార్హం.
దీంతో వీరబ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఆయన చెప్పినవన్ని జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే మనకు కొన్ని కనబడుతుండగా ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ అంతం దగ్గరకొచ్చిందని కొందరు వాదనలు చేస్తున్నారు.
Also Read: ChandraBabu Naidu Wedding Card: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?