Nepal Plane Accidents: నేపాల్.. హిమాలయ పర్వత శ్రేణుల్లోల ఉన్న చిన్న దేశం.. కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే ఆధ్యాత్మిక నియమైన నేపాల్ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. దీంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడికి రావడానికి విమానాలే వారికి వాహనం. అయితే ప్రపంచంలో ఏ దేశంలో జరుగనన్ని విమాన ప్రమాదాలు నేపాల్ దేశంలోనే జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో కొన్ని దేశాలు నేపాల్ ప్రయాణాన్ని నిషేధించాయి. తాజాగా నేపాల్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం నేపాల్‌లోని ఖడ్మండు నుంచి ఫోక్రాకు బయల్దేరింది. హిమాలయ పర్వతాల మీదుగా వెళ్లాలి. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఇందులో ఉన్నారు. ఉదయం 11 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, సముద్రంలో కూలిపోయింది. సాంకేతిక లోపంతో కూలిపోయిందన్న వార్త వచ్చింది. ప్రతికూల ప్రభావం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ల్యాండింగ్‌కు కొద్దిసేపు ముందు మాట్లాడారు కూడా. ఈ విమాన ప్రమాదంలో భారతీయులు ఆరుగురు మృతిచెందారు. నలుగురి ఆచూకీ లేదు.
30 ఏళ్లలో 28 ప్రమాదాలు..
నేపాల్‌లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు గత 30 ఏళ్లలో 28 విమాన ప్రమాదాలు జరిగాయి. అనుభవం లేని పైలెట్లు. మంచు పర్వతాలు, ప్రతికూల వాతావరణం. విమాన ప్రమాదాలు, అందులోనూ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాలు నేపాల్ లోనే జరుగుతున్నాయి. ఇవే నేపాల్‌కు చెడ్డపేరు తెచ్చాయి. అందుకే నేపాల్ విమానాలపై యూరోపియన్ యూనియన్ 2013లో ఆంక్షలు విధించింది. నేపాల్ విమానాలను తమ గగనతలంపై నిషేధించింది.
నేపాల్ కి ఉన్న శాపం ఏంటి.. ?
నేపాల్ లో జరిగే విమాన ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. ప్రకృతి ప్రకోపం అందులో ప్రధానమైనది. ఎప్పుడెలా ఉంటుందో తెలియని వాతావరణ పరిస్థితి నేపాల్‌లో ఉంటుంది. అక్కడ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. అంతా బాగుంది అంటూ ఎయిర్ ట్రాఫిక్ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, మధ్యలో ఏదో ఒక చోట హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. అందుకే నేపాల్‌లో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి, ల్యాండింగ్ అయ్యే వరకు అందరూ టెన్షన్.. టెన్షన్‌గా ఉంటారు. వీటన్నింటికీ ప్రధాన కారణం హిమాలయాలు. ఈ మహా పర్వత సానువుల వల్ల విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. గతేడాది మేలో జరిగిన ప్రమాదంలో మొత్తం 22మంది చనిపోగా, ఈ ఏడాది తాజాగా జరిగిన ప్రమాదం, మరింత ఘోరం. అసలు నేపాల్ విమానాలంటేనే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి.
అక్కడ ఫ్లైట్ నడపడం చాలా కష్టం..
నేపాల్‌లో ఫ్టైట్ నడపడం చాలా కష్టమని నేపాల్ ఏవియేషన్ అధికారులు చెబుతారు. అక్కడి నిబంధనల ప్రకారం వంద గంటలు ఫ్లైట్ నడిపిన కో పైలెట్‌కు పైలెట్‌గా ప్రమోషన్ ఇస్తారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కోపైలెట్ విమానం నడుపుతున్నట్లు తెలిసింది. 30 ఏళ్ల అనుభవం ఉన్న పైలెట్ పక్కనే ఉన్న ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. అక్కడి రన్‌వే ఎత్తయిన పర్వాతలకు సమీపంలో ఉండడం, వాతారణ పరిస్థితులు కూడా ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. నేపాల్ విమానయాన సంస్థల్లో పనిచేసే పైలట్లు అరకొర శిక్షణతో క్యాబిన్‌లో కూర్చుంటున్నారనే ఆరోపణలున్నాయి.
భిన్నమైన భౌగోళిక పరిస్థితులు..
భౌగోళికంగా ఆ దేశం అన్ని దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. అక్కడ కొండ చెరియలు ఎక్కువగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం కూడా అక్కడే ఉంటుంది. ఇలాంటి కొండల మధ్య నుంచే రన్ వే ఏర్పాటు చేసింది ఆ దేశం దీంతో ల్యాండిగ్, టేకాఫ్ రెండు సమయాల్లో ప్రణాలు ఉంటాయా? పోతాయా? అన్న అనుమానం కలుగక మానదు. మరో విషయం ఏంటంటే అక్కడి వాతావరణం. ఫ్లైట్ జర్నీ ముఖ్యంగా వాతావరణంపైనే ఆధారపడుతుంది. నావిగేషన్ సిస్టం సరిగా ఉన్నా కూడా వాతావరణంలో మార్పుల వల్ల పైలట్ కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్కువగా కొండగలు, గుట్టలు ఉంటాయి కాబట్టి మేఘాలు కింది నుంచి ప్రయాణిసస్తాయి. గాలులు కూడా ఎక్కువగా వీస్తూ వాతావరణంలో తేమ ఎక్కువవుతుంది. దీని వల్ల పైలట్ కు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో ఫ్లైట్ క్రాష్ అవుతుంది.
సెకండ్ హ్యాండ్ విమానాలే..
ఇతర దేశాల్లో ఉన్న కఠిన నిబంధనలు నేపాల్ పైలట్లకు ఉండవు. విమానయాన సంస్థల పనితీరు కూడా అంతంతమాత్రమే. కొత్త విమానాలు ఉండవు. పురాతన విమానాలు, ఇతర దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ విమానాలను కొనుగోలు చేసి, వాటికి మరమ్మతులు చేసి నేపాల్ విమాన సంస్థలు నడుపుతుంటాయనేది బహిరంగ రహస్యం. తాజాగా ప్రమాదానికి గురైన విమానం కూడా కొత్తది కాదు. గతంలో కింగ్ ఫిషర్ కంపెనీ వాడిన విమానం అది. ఇలా కొనుగోలు చేసిన సెకెండ్ హ్యాండ్ విమానాల నిర్వహణ కూడా దారుణంగా ఉంటుంది. అందుకే ప్రమాదాలు ఎక్కువ.
బలహీనమైన ఏవియేషన్..
ఆధునిక యుగంలో మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి అతి తక్కువ సమయంలో వెళ్లేందుకు ఉపయోగించే ఏకైక సాధనం విమానం. ఆకాశంలో ఎగిరే ఈ వాహనాలు ఖండాలను కలుపుతూ ప్రపంచాన్నికు గ్రామంగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. విమానాలకు సంబంధించి ఆయా దేశం నిర్వహించే వ్యవస్థనే ‘ఏవియేషన్’ అంటారు. అది ఒక్కో దేశానికి ఒకలా ఉంటుంది బాగా రిచ్ కంట్రీస్ అయితే పటిష్టమైన ఏవియేషన్ వ్యవస్థ ఉండగా.. పేద దేశాలకు మరోలా ఉంటుంది. దీనికి కారణం వారు దాన్ని డెవలప్ చేసుకోకపోవడమే. అయితే ఇక్కడ నేపాల్ ఏవియేషన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇకడ పాతకాలం నాటి రాడార్ వ్యస్థనే ఉపయోగిస్తున్నారు. ఆధునికీకరణకు నేపాల్ చాలా దూరంగా ఉంది. అక్కడ రాడార్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో పైలట్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అందుకే అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
అతిపెద్ద ప్రమాదాలు..
ఇప్పటి వరకు నేపాల్ లో చాలా ప్రమాదాలు జరిగాయి.
– పాకిస్తాన్ ఫ్లయిట్ ట్రాజడీలో దాదాపు 164 మంది వరకు ప్రయాణికులు మరణించారు.
– 2019లో హెలికాప్టర్ ప్రమాదంలో నేపాల్ పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి, పారిశ్రామిక వేత్త ఆంగ్ శిరంగ్ శర్పాతో పాటు ముఖ్యమైన ఏడుగురు అధికారులు మరణించారు.
– 2018లో యూఎస్ బంగ్లాకు చెందిన ప్యాసింజర్‌లో ప్రయాణిస్తున్న 52 మంది మరణించారు.