Justin Trudeau: జస్టిన్ ట్రూడో(Justin trudo) మొదటినుంచి కూడా భారత దేశానికి వ్యతిరేకి. మనదేశంలోని అంతర్గత వ్యవహారాలలో వేలుపెట్టడానికి అనేకసార్లు ప్రయత్నించాడు. అయితే వివిధ వేదికల వద్ద మన దేశం దీనిని తిప్పి కొట్టడంతో జస్టిన్ ట్రూడో(Justin trudo) కు ముఖం వాచిపోయింది. అయితే ఇదే సమయంలో ఖలిస్థాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా దేశంలో హత్యకు గురయ్యారు. ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జస్టిన్ ట్రూడో(Justin trudo) ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే నిజ్జర్ హత్య కేసులో భారతదేశానికి సంబంధం ఉందని.. గూడచారుల ద్వారా భారతదేశం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించడం మొదలుపెట్టాడు. ఆ మధ్య మనదేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఖలిస్థానీ జెండాలు కనిపించాయి. ఎర్రకోటపై ఆ జెండాను ఎగరవేశారు కూడా. కొంతమంది ఖలిస్థానీ నినాదాలు చేశారు. అయితే వీటి వెనక కెనడా ప్రభుత్వ హస్తం ఉందని నాడు భారత్ ఆరోపించింది. అంతేకాదు G-7 SUMMIT తర్వాత ట్రూడో చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించింది. మన దేశానికి వ్యతిరేకంగా ట్రూడో చేస్తున్న కార్యకలాపాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది. వీటిని ట్రూడో ఖండించారు. భారత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఖలిస్థానీ శక్తులకు అనుకూలంగా మాట్లాడారు.
నలుగురికి బెయిల్
భారత్ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్న ట్రూడో.. కెనడా దేశంలో అంతర్గతంగా పోరు మొదలైంది. అక్కడి ప్రతిపక్షాలు ట్రూడో తీరును తప్పు పట్టాయి. ఈ నేపథ్యంలో ఇంకా పదవి కాలం ఉన్నప్పటికీ ట్రూడో రాజీనామా చేశారు.. మరి కొద్ది రోజుల్లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నారు. ఆ తర్వాత ఆ దేశంలో ఎన్నికలు నిర్వహిస్తారు. సరిగ్గా ఎన్నికలకు ముందు నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం అభియోగాలు మోపిన నలుగురు భారతీయులకు బెయిల్ లభించింది. ఈ కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. అయితే నిజ్జర్ హత్యకు అమిత్ షా, అజిత్ దోవల్, జై శంకర్ కుట్ర పన్నారని.. దానికి ప్రణాళిక కూడా వారి రూపొందించారని ట్రూడో ప్రభుత్వం అప్పట్లో ఆరోపించింది. మనదేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనే .. మరింత అగ్గి రాజేసే విధంగా కెనడా ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే నిజ్జర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయులకు న్యాయ సహాయం అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెరవెనుక కృషి చేశారని.. ఇప్పుడు ఆయన వేసిన పాచిక వల్ల ట్రూడో పదవిని కోల్పోవడమే కాదు.. చివరికి కోర్టుల ముందు కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.