Morocco: ప్రతీ దేశంలో వీధి కుక్కలు (Street Dogs) అనేవి సహజంగా ఉంటాయి. నిజానికి ఒక్కో వీధికి కనీసంలో రెండు నుంచి మూడు కుక్కలు (Street Dogs) అయినా ఉంటాయి. అయితే వీటిని సాధారణంగా ఎవరూ కూడా చంపరు. పిల్లలు లేదా ఇతరులపై దాడి చేస్తేనే వీటిని చంపుతారు. కానీ ప్రపంచంలోని ఓ దేశం వీధి కుక్కలను (Street Dogs) చంపాలని ప్లాన్ చేస్తోంది. దాదాపుగా 30 లక్షల వీధి కుక్కలను చంపడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ దేశం ఏది? అసలు ఎందుకు వీధి కుక్కలను చంపాలని ప్లాన్ చేస్తోంది. దీనికి గల కారణాలు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
మొరాకో దేశం వీధి కుక్కలను చంపాలని ప్లాన్ చేస్తోంది. 2030 ఫిఫా ప్రపంచ కప్ వస్తుంది. దీని కోసం దాదాపుగా 3 మిలియన్ కుక్కలను చంపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం నగరాలను సందర్శించే అభిమానులకు మరింత అందంగా కనిపించేలా ఇలా చేయనున్నారట. వీధి కుక్కలను ఇలా చేయడం వల్ల నగరాలు ఇంకా అందంగా కనిపిస్తాయనే ఉద్దేశంతో భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది సీక్రెట్‌గా పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దీంతో పలువురు మొరాకో దేశంపై మండిపడుతున్నారు. గతంలో ఉత్తర ఆఫ్రికా దేశంలో కూడా పలు ప్రదేశాల్లోని కుక్కలను చంపడం ప్రారంభించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఫిఫా ప్రపంచ కప్ వేదికకు మొరాకో అని ఫిక్స్ కాకముందే.. ఆ దేశం కుక్కలను చంపాలని నిర్ణయించుకుందని అంటున్నారు. 2030లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ 100వ వార్షికోత్సవం కావడంతో మొరాకో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవే కాకుండా స్ట్రైక్నైన్‌తో విష ప్రయోగం, కాల్పులు వంటివి కూడా ఉన్నట్లు సమాచారం. వీధి కుక్కలను కొన్ని పరికరాలతో బంధించి వాటిని కొట్టి చంపుతారట.