Earthquake: మన పొరుగు దేశం మయన్మార్(Mayanmar)పై ప్రకృతి శుక్రవారం(మార్చి 28న) కన్నెర్రజేసింది. మధ్యాహ్నం సమయంలో సంభవించిన భారీ భూకంపం(EarthQuake) ఆ దేశాన్ని చిగురుటాకులా వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదైన ఈ భూకంపం కేంద్రం మయన్మార్ సెంట్రల్ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, పొరుగున ఉన్న థాయ్‌లాండ్(Thailand)లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోనూ భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో అక్కడ కూడా భవనాలు నేలమట్టమయ్యాయి.
Also Read: కడపలో సరే.. మరి విశాఖలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం అదే!
భారీగా నష్టం..
ఈ భూకంపం తీవ్రత అంతా ఇంతా కాదు. బ్యాంకాక్‌లో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బహుళ అంతస్తుల భవనాల్లోని స్విమ్మింగ్ పూల్స్(Swimming pools)నుంచి నీరు కిందకు జారడం, భవనాలు కూలిపోవడం వంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మయన్మార్‌లోని సాగైంగ్ సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఖచ్చితమైన నష్ట వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, భారతదేశంలోని మణిపూర్(Manipur)లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. ఈ భూకంపం ప్రభావం దాదాపు 900 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకాక్ వరకూ విస్తరించడం దాని తీవ్రతను తెలియజేస్తోంది. మయన్మార్‌లో గతంలో కూడా సాగైంగ్ ఫాల్ట్ వల్ల భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం.
అధికారుల సమీక్ష…
ప్రస్తుతం మయన్మార్, థాయ్‌లాండ్‌లో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో, రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భూకంపం ప్రభావం ఆసియా ఖండంలోని పలు ప్రాంతాల్లో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సహాయక బందాలు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
A massive 7.6 magnitude earthquake just hit Thailand. pic.twitter.com/Nbq70Xfsko
— RyanMatta (@RyanMattaMedia) March 28, 2025