USA on India-China: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. అమెరికా అంటేనే స్వార్థపూరితమైన దేశమని.. తన అవసరాల కోసం.. తన ప్రయోజనాల కోసం ఎంతటికైనా దిగజారుతుందని.. ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని బయటికి పంపించాడు కదా. ఇటీవల కాలంలో మరో అడుగు ముందుకేసి ప్రపంచ దేశాల మీద సుంకాల మోత మోగిస్తున్నాడు. కెనడా నుంచి మొదలుపెడితే భారత వరకు ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టకుండా సుంకాలతో ఇబ్బంది పెడుతున్నాడు.
ఇటీవల కాలంలో రష్యా నుంచి ముడి చమురు కొనకూడదని ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. దానికి భారత్ ఒప్పుకోలేదు. రష్యా నుంచి కొనుగోలు చేయడం ఖాయమని స్పష్టం చేసింది. దీంతో ఒళ్ళు మండిన అమెరికా మరిన్ని సుంకాలను భారత్ మీద వేసింది. ఆ సుంకాల శాతం25 కి పెరిగింది. దీనిపై మన దేశం కూడా అమెరికాకు గట్టిగానే సమాధానం ఇస్తోంది.
Also Read: మునీరూ.. నీకు మూడిందిరా.. ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన పాక్ ఆర్మీ చీఫ్
సుంకాల పెరుగుదల నేపథ్యంలో బ్రిక్స్ కరెన్సీ తెరపైకి వచ్చింది.. బ్రిక్స్ దేశాలు బలోపేతం కావాలనే ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. మొత్తంగా చూస్తే అమెరికా పెత్తనానికి గండి కొట్టాలని భారత్ భావిస్తోంది. అయితే అమెరికా భారత్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి.. చైనా విషయంలో ప్రదర్శిస్తున్న విధానం బయటపడ్డాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చైనాపై ఎందుకు టారిఫ్ విధించడం లేదనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన ” డ్రాగన్ పై ఆంక్షలు విధిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి” అని సమాధానం ఇచ్చారు. భారత్ కూడా రష్యా నుంచే ఆయిల్ కొంటున్నది కదా అని ప్రశ్న వేస్తే దానికి ఆయన సమాధానం దాటవేశారు. పాకిస్తాన్ దేశంతో అంట కాగుతున్న అమెరికా.. మనపై తీవ్ర అక్కసు ప్రదర్శిస్తోంది. లేనిపోని టారిఫ్స్ విధిస్తూ తన ద్వంద్వ నీతిని బయటపెడుతున్నది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందని.. యూరోపియన్ యూనియన్, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందని భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.