Los Angeles Fires: ప్రకృతి(nature)కి మనం ఏదిస్తే అదే తిరిగిస్తుంది. మొక్కలు పెంచామనుకోండి వాతావరణం బాగుంటుంది. అదే చెట్ల(trees)ను నరికేశామనుకోండి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. సంద్రాన్ని(ocean) దిశ మార్చి.. నదీ(river) గమనాన్ని దారి మళ్లించి.. పర్వతాన్ని(hill) పెకిలించి.. ఇసుక(sand)ను తవ్వేసి.. భూమి(Earth)ని కుల్లబొడిస్తే.. దాని పర్యవసనాలు కూడా అదే విధంగా ఉంటాయి. అది అమెరికానా.. ఆఫ్రికానా అనేది మ్యాటర్ కాదు.. ఎక్కడైనా ఇదే తంతు.. అందు గురించే ప్రకృతి(environmental)తో సహవాసం చేయాలి. అంటే తప్ప పెత్తనం చేస్తే ఇదిగో అమెరికా(America)లో రేగిన మంటల(wildfire) మాదిరిగానే ఉంటుంది.
అమెరికా (America) లో లాస్ ఏంజిల్స్ (los Angels) లో సంపన్నులు అధికంగా నివాసం ఉంటారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అమెరికాలో కార్చిచ్చు (wildfire) అనేది సర్వసాధారణమైనప్పటికీ.. ఈ కాలంలో అమెరికాలో ఈ స్థాయిలో మంటలు వ్యాపించడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడు ఈ తీరుగా.. ఈకాలంలో మంటలు వ్యాపించలేదు. ఫలితంగా లాస్ ఏంజిల్స్ ప్రాంతం కాలి బూడిదయిపోయింది. ఎటు చూసినా కూడా కాలిపోయిన గృహాలు.. నేలమట్టమైన సముదాయాలు.. బొగ్గులుగా మారిన వృక్షాలు కనిపిస్తున్నాయి. నష్టం ఇప్పటికే లక్షల కోట్లు దాటిందని అమెరికా మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ మంటలు ఇంతవరకు అదుపులోకి రాలేదు. అమెరికా తన శక్తిని మొత్తం ధారపోసినప్పటికీ మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి తప్ప.. ఎంత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఏం చేయాలో అంతుపట్టక అగ్రరాజ్యం తలలు పట్టుకుంటున్నది.
డబ్బుందని విర్రవీగితే
మన తెలంగాణలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, మాదాపూర్ ప్రాంతాలలో శ్రీమంతులు ఉంటారు. విలాసవంతమైన భవనాలలో నివాసం ఉంటారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోనూ శ్రీమంతులు ఉంటారు. హాలీవుడ్ (Hollywood)లోని ప్రముఖ నటులు కూడా లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో విపరీతంగా మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖులు పారిస్ హీల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడం బ్రాడీ, జేమ్స్ వుడ్ లాంటి వారి గృహాలు కాలి బూడిద అయిపోయాయి. వీరు తమ గృహాలను అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారు. సకల సౌకర్యాలను అందులో పొందుపరుచుకున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పై సెలబ్రిటీలకు అమెరికా సమాజంలో విపరీతమైన పేరు ఉంది. అంతకుమించి డబ్బుంది. కొండమీద కోతినైనా తెచ్చుకునే సామర్థ్యం ఉంది. కోరుకున్నది కళ్ళ ముందు ఉంచుకునే ఆర్థిక స్థిరత్వం ఉంది. అయినప్పటికీ దూసుకు వచ్చే మంటల ముందు వారి సెలబ్రిటీ హోదా పనిచేయలేదు. మిలియన్ డాలర్ల సొమ్ము అడ్డుకోలేదు. డబ్బుందని విర్రవీగిన తనం ఆపలేదు. అన్నింటికీ మించి తాము డెమి గాడ్స్ అని చెప్పుకునే తత్వం నిలువరించలేదు.. స్థూలంగా చెప్పాలంటే ప్రకృతి అనేది మనకు అన్ని ఇచ్చింది. మనం మాత్రం దాని మీద పెత్తనం చేస్తున్నాం. అది భరించలేనంత స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాం. అందువల్లే అది తిరగబడుతోంది. ఇలా మండిపోతోంది. ఇప్పుడు ఈ మంటలు ఎంతవరకు విస్తరిస్తాయో.. ఇంకా ఏ స్థాయిలో కాలి బూడిద చేస్తాయో.. అంతటి అమెరికాకు కూడా అంతు పట్టడం లేదు..