https://oktelugu.com/

Lightning Strike: ఫుట్ బాల్ మైదానంలో ఘోరం.. పిడుగుపాటుకు ఆటగాడు దుర్మరణం, అనేకమందికి గాయాలు: వీడియో వైరల్

ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. మైదానంలో హోరాహోరి నెలకొంది. ప్రేక్షకులు అంతంత మాత్రం గానే హాజరయ్యారు. ఇదే క్రమంలో ఉన్నటువంటి అక్కడ పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు నెలకొన్నాయి. చూస్తుండగానే దారుణం జరిగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 6, 2024 / 10:08 AM IST

    Lightning Strike

    Follow us on

    Lightning Strike: పిడుగుపాటుతో ఓ ఆటగాడు దుర్మరణం చెందాడు. మ్యాచ్ రిఫరీ, ఇతర ఆటగాళ్లు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది..ఫుట్ బాల్ చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని అభిమానులు పేర్కొంటున్నారు. పెరూ దేశంలోని చిల్కా లో జరిగింది. నవంబర్ 3న దేశ క్లబ్ లైన జువెంటుడ్ బెల్లా విస్టా, పామిలియా చొక్కా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. మ్యాచ్ లో భాగంగా ఫస్ట్ హాఫ్ జరుగుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో జువెంటుడ్ బెల్లా విస్టా మ్యాచ్ లో 2-0 లీడ్ లో నిలిచింది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో రిఫరీ వాతావరణాన్ని అంచనా వేసి ఆటను నిలుపుదల చేశాడు. వాతావరణం విభిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్లేయర్లు గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశాడు. దానికి తగ్గట్టుగానే విజిల్స్ కూడా వేశాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు రిఫర్ ఆదేశాలకు అనుగుణంగా మైదానాన్ని వీడుతున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా పిడుగుపాటు చోటుచేసుకుంది. అది కాస్తా జోస్ హ్యూగో డి లా క్రూజ్(39) పై పడింది.. దీంతో అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. విపరీతమైన మెరుపు, వేడి కారణంగా రిఫరీ, మరో ఐదుగురు ఆటగాళ్లు మైదానంలో అలా పడిపోయారు.. ఈ ఘటనలో గోల్ కీపర్ జువాన్ చోకా తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి 40 సంవత్సరాలు. అతడి శరీరం కాలిపోయింది. పిడుగుపాటు తర్వాత మైదానంలో పడిపోయిన ఆటగాళ్లలో ఒకరిద్దరూ లేవడానికి ప్రయత్నించారు. అయితే లేచి నిలబడే శక్తి లేకపోవడంతో అలాగే కింద పడిపోయారు.. గాయపడిన ఆటగాళ్లు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    ఇదే తొలిసారి కాదు

    పిడుగుపాటుతో ఫుట్ బాల్ ప్లేయర్ కనుమూయడం ఇది తొలిసారి కాదు. ఈయడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రాంతంలో సిలి వాంగి మైదానంలో ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో మైదానంలో పిడుగుపాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 సంవత్సరాల సెప్టెన్ రహ రాజా దుర్మరణం తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.. అప్పట్లో ఇతర ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. గతంలో ఫుట్ బాల్ మైదానాలలో పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, నవంబర్లో మాత్రం పిడుగు పాటు వల్ల ఇద్దరు ఆటగాళ్లు కన్నుమూయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ” ఫుట్ బాల్ ఆటగాళ్లపై ప్రకృతి పగ పట్టిందేమో అనిపిస్తోంది.. వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నిరోధించడం ఎవరివల్లా కాకపోయినప్పటికీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు కచ్చితంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటకంటే ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలు కాపాడుకుంటే ఆట మరుసటి రోజైనా ఆడొచ్చని” అభిమానులు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యలు ఇస్తున్నారు