Homeఅంతర్జాతీయంLiechtenstein facts: అమెరికా కాదు.. స్విట్జర్లాండ్ అంతకన్నా కాదు.. ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన దేశం ఇదే.

Liechtenstein facts: అమెరికా కాదు.. స్విట్జర్లాండ్ అంతకన్నా కాదు.. ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన దేశం ఇదే.

Liechtenstein facts: నేరాల బెడద లేదు. అవినీతి ఇబ్బంది లేదు. సొంతంగా విమానాశ్రయం లేదు. ఆమాటకు వస్తే సొంతంగా భాష కూడా లేదు. అయినప్పటికీ అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కావలసినంత సంపాదిస్తున్నారు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఉపోద్ఘాతం చదివిన తర్వాత.. ఆదేశం ఏ స్విట్జర్లాండో, స్వీడనో అనుకుంటున్నారా.. కానీ కాదు.. ఇంతకీ ఆ దేశం ఏమిటి? అది ఎక్కడ ఉంది? ఈ విశేషాలు ఈ కథనంలో

లైచెన్ స్టెయిన్.. ఇది ఒక బుల్లి దేశం. ఇది ఐరోపాలో ఉంటుంది. జర్మనీ, ఆస్ట్రియా దేశాల మధ్యలో ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువగా జర్మన్ మాట్లాడుతుంటారు. ఈ దేశం మొత్తం జనాభా 30,000 మాత్రమే. ఈ దేశ రాజధాని వాడూజ్. ఈ దేశంలో ప్రజలు వివిధ రకాల వృత్తులు చేస్తుంటారు. చాలామంది సేవల రంగంలో ఉన్నారు. ఇక్కడ పన్నులు అత్యంత స్వల్పం. ఈ దేశం మొత్తానికి కేవలం వందమంది పోలీస్ అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏడుగురు మాత్రమే జైలుకు వెళ్లారు. వారు కూడా స్వల్ప నేరాలకు పాల్పడిన నేపథ్యంలో వారికి జైలు శిక్ష విధించారు. అయితే వారికి ప్రతిరోజు రెస్టారెంట్ నుంచి భోజనం పంపిస్తారు. ఇక్కడ ఎక్కువ శబ్దాన్ని చేయడానికి నేరంగా పరిగణిస్తారు. డాబు దర్పాన్ని ప్రదర్శించడానికి కూడా తప్పుగా పేర్కొంటారు. ఒకరిని ఒకరు ప్రేమగా పలకరించుకుంటారు. గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏకవక సంబోధన కాకుండా.. గౌరవ వాచకంతో పిలుస్తారు.

Also Read: ఇళ్లకు ఇళ్లనే లాగేశాయి.. ఏం వరదలు రా బాబూ.. షాకింగ్ వీడియో

ఇక్కడ ప్రజలు ఎంత సౌభాగ్యంతో జీవిస్తుంటారు. ఏదైతే వారికి ఆనందాన్ని కలిగిస్తుందో దానికోసం మాత్రమే ఖర్చు పెడుతుంటారు. సామూహికంగా జీవించడానికి ఇష్టపడుతుంటారు. వారాంతాల్లో క్రీడలు ఆడుతుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక్కడ నేరాలు జరగవు కాబట్టి ప్రజలు తమ గృహాలకు తాళాలు వేయరు. ఎక్కువగా సామూహిక జీవితాన్ని ఇష్టపడుతుంటారు. సమిష్టిగా ఉంటూ జీవితాన్ని గొప్పగా ఆస్వాదిస్తూ ఉంటారు.. ప్రజలు ఇంతటి గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు కాబట్టి ఈ దేశానికి అప్పులు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతోంది. ఇక్కడ ప్రకృతి రమణీయత పర్యటకులను కట్టిపడేస్తుంది.

ఇక్కడ నివసించే ప్రజలు అమెరికా దేశానికంటే ఐదు రెట్లు ఎక్కువ సేవలు పొందుతుంటారు. తాగునీరు, రవాణా వంటివి ఈ దేశంలో అత్యంత బాగుంటాయి. రోడ్లు అద్దాల లాగా మెరుస్తుంటాయి. ఇక్కడ ప్రజలు పర్యావరణహితంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి.. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోవు. వేసవికాలం మినహా మిగతా అన్ని కాలాలలో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. అయితే ఈ దేశానికి అధికారికంగా భాష లేకపోయినప్పటికీ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. ఈ దేశానికి సొంతంగా అధికారిక జెండా ఉంది. ఈ దేశంలో ప్రజలు ఎక్కువగా జర్మనీ భాష మాట్లాడుతుంటారు. జర్మనీ, ఆస్ట్రియా దేశాల మధ్య ఈ ప్రాంతం ఉండడంతో.. రెండు దేశాల చెందినవారు ఈ ప్రాంతానికి నిత్యం వస్తూనే ఉంటారు. పర్యటకులకు మాత్రం ఈ ప్రాంతం స్వర్గధామం లాగా ఉంటుంది. అందమైన పర్వతాలు.. అంతకుమించి అనేలాగా నదులు.. లోయలు ఈ దేశానికి ఆభరణాలుగా ఉంటున్నాయి. యూరప్ ప్రాంతంలో ఈ దేశాన్ని వజ్రం లాగా అక్కడి ప్రజలు పిలుస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular