HomeNewsGlobal Flood Crisis: ఇళ్లకు ఇళ్లనే లాగేశాయి.. ఏం వరదలు రా బాబూ.. షాకింగ్ వీడియో

Global Flood Crisis: ఇళ్లకు ఇళ్లనే లాగేశాయి.. ఏం వరదలు రా బాబూ.. షాకింగ్ వీడియో

Global Flood Crisis: పీల్చడానికి గాలిని.. తాగడానికి నీటిని.. ఉండడానికి ఆవాసాన్ని.. బతకడానికి తిండిని.. సహవాసం చేయడానికి సమూహాన్ని.. ఇలా ప్రతి ఒక్కటిని ప్రకృతి ఇస్తుంది. అందువల్లే ఈ భూమ్మీద జీవరాశి ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ.. ఈ భూమి మీద జీవరాశి ఇంకా మనుగడ కొనసాగిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం ప్రకృతి కరుణే. ఈ భూమి మీద ఏ జంతువు కూడా ప్రకృతికి నాశనాన్ని తలపెట్టదు. ఒక్క మనిషి తప్ప.

తన అత్యాశకు చెట్లను కొట్టాడు. గుట్టలను తొలిచాడు. గుహలను ధ్వంసం చేశాడు. అభివృద్ధి పేరుతో ప్రకృతి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. అయినప్పటికీ ప్రకృతి భరిస్తూనే ఉంది. పంటి బిగువన బాధను తట్టుకుంటూనే ఉంది. అయినప్పటికీ మనుషుల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా నీటితో చెలగాటమాడుతున్నాడు. మట్టితో విన్యాసం చేస్తున్నాడు. గాలితో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇవన్నీ చూసి చూసి ప్రకృతికి విపరీతమైన కోపం వచ్చింది. అందువల్లే తన కోపాన్ని ఏదో ఒక రూపంలో గట్టిగానే చూపిస్తోంది. అభివృద్ధి పేరుతో మనిషి కట్టిన మేడలను.. మనిషి తన సౌకర్యం కోసం ప్రయాణిస్తున్న వాహనాలను.. మనిషి తన సుఖం కోసం చేపట్టిన ప్రతి నిర్మాణాన్ని ప్రకృతి పడగొడుతుంది. పడగొట్టడమే కాదు కాలగర్భంలో కలిపేస్తోంది. ఆయనప్పటికీ మనిషికి బుద్ధి రావడం లేదు. ప్రకృతి కోపం అర్థం కావడం లేదు.

Also Read: తగ్గేదేలే.. జగన్ అదే బలప్రదర్శన!

ఇటీవల కాలంలో అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకున్న వరదలు విపరీతమైన నష్టాన్ని కలగజేశాయి. టెక్సాస్ రాష్ట్రం చిగురుటాకు లాగా వణికిపోయింది. ఇక చైనాలో అయితే ఏకంగా ప్రాంతాలకు ప్రాంతాలే నీట మునిగిపోయాయి. ఊహించని స్థాయిలో చైనాకు నష్టాన్ని కలిగించాయి. ఇక ప్రస్తుతం మెక్సికో లోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల సంభవిస్తున్న వరద మెక్సికో ను అతలాకుతలం చేస్తోంది. గృహాలకు గృహాలే కొట్టుకొని వస్తున్నాయి. మెక్సికోలో గృహాల నిర్మాణం అత్యంత పటిష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వరదల వల్ల గృహాలు కొట్టుకొని వస్తున్నాయంటే వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మెక్సికోలో సంభవించిన వరదల వల్ల కొట్టుకొని వస్తున్న గృహాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ఈ గృహాలు కొట్టుకొని వస్తున్న తీరును చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వామ్మో ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ స్థాయిలో వరదలు వస్తున్నాయి. మనుషులు బతకడం కష్టమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మెక్సికోలో ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. ఆకస్మికంగా వరదలు రావడం.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం.. కరువు కాటకాలు ఏర్పడుతుండడంతో మెక్సికో దేశం తీవ్రమైన ఇబ్బంది పడుతోంది. దీనంతటికీ కారణం అక్కడ పర్యావరణ విధ్వంసం విపరీతంగా జరగడమే. ఇన్ని ఉత్పాతాల తర్వాత అక్కడి పరిపాలకులు మారుతారా? ప్రజలు చైతన్యవంతులు అవుతారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular