Site icon OkTelugu

Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు మూవీ కొత్త డైరెక్టర్ ఎవరు.. మళ్లీ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు…

Who is the new director of Hari Hara Veeramallu movie

Who is the new director of Hari Hara Veeramallu movie

Hari Hara Veeramallu: తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన ప్రస్తుతం పొలిటికల్ గా బిజీగా ఉంటూనే, సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కనక ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని సినిమాలు చేయగలిగితే ఆయనను మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆయనని బీట్ చేసే హీరో మరొకరు ఉండరనేది వాస్తవం.

కానీ తను పార్ట్ టైం హీరో గా సినిమాలు చేయడం వల్ల భారీ రేంజ్ మార్కెట్ అయితే దక్కించుకోలేకపోతున్నారు. కానీ ఒకసారి ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగితే మాత్రం ఆయనను మించిన తోపు హీరో మరొకరు ఉండరు అనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గత మూడు సంవత్సరాల క్రితం క్రిష్ డైరెక్షన్ లో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద డేట్స్ ఎక్కువగా కేటాయించలేకపోవడంతో అది తాత్కాలికంగా ఆగిపోయింది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా మళ్లీ షూట్ స్టార్ట్ చేసి భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికైతే ఈ సినిమాకి క్రిష్ డైరెక్షన్ చేశాడు. కానీ తను కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ని కూడా అందించారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి ఎవరు డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు అనేది ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు.

ఇక మరికొందరైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తారు అంటూ కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్టుని వేరే డైరెక్టర్ కి అప్పజెప్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తారా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది…

Exit mobile version