https://oktelugu.com/

Justin Trudeau: సొంత ఇంటెలిజెన్స్‌పై ట్రూడో ఆగ్రహం.. క్రిమినల్స్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు..

ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌–కెనడా సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల దౌత్యపరంగా తీవ్ర విభేదాలు వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 24, 2024 / 01:00 PM IST

    Justin Trudeau

    Follow us on

    Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాదిని అడ్డం పెట్టుకుని వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో భారతీయుల ఓట్లు పొందాలని చూస్తున్నాడు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. అభివృద్ధి చెందిన దేశమే అయినా.. ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకుగురై ఏడాది దాటింది. ఇప్పటికీ దోషులను పట్టుకోలేదు. ఆధారాలు సేకరించే. కేవలం భారత భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ ఉందని ఆరోపణలు చేస్తూ.. భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. తద్వారా కెనడాలో 6 శాతంపైగా ఉన్న సిక్కుల ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శుల విచారణకు సిద్ధమయ్యాడు. దీనిపనై ఆగ్రహించిన భారత్‌.. వెంటనే భారత రాయబారులను వెనక్కు పిలిపించింది. అంతేకాదు.. భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ తరహాలో కెనడా వ్యవహరిస్తున్న శైలిపై భారతీయులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిపై అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ల కథనం రాయించింది. తాజాగా భారత ప్రధాని మోదీనే టార్గెట్‌ చేసింది. ఆయనపై సైతం కథనాలు రాయించింది.

    ట్రూడో అసహనం..
    నిజ్జర్‌ హత్యకుట్రలో భారత ప్రధాని, విదేశాంగ మంత్రులు కూడా భాగమైనట్లు కెనడా మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సొంత ఇంటెలిజెన్స్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని నేరస్థులుగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్‌ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేయడం.. దాని నుంచి కొన్ని తప్పుడు కథనాలు పచురితం కావడం చూశానని తెలిపారు. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలి అని పేర్కొన్నారు. వార్తా పత్రికలకు అత్యంత రహస్యమైన సమాచారం లీక్‌ అవకుండా నిరోధిస్తామని తెలిపారు.

    స్థానిక పత్రికలో కథనం..
    కెనడాకు చెందిన చీది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే పత్రికలో ఇటీవల నిజ్జర్‌ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్య కుట్రలో భారత జాతీయ భద్రతాసలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉందని తమకు తెలిసిందని కెనడా సీనియర్‌ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు కథనంలో పేర్కొంది. ఈ కథనంలో ఏకంగా భారత ప్రధాని మోదీ పేరు ప్రస్తావించింది. దీనిపై భారత్‌ మండిపడింది. దీంతో అప్రమత్తమైన కెనడా ఈ వార్త కథనాలు అవాస్తవమని కెనడా ప్రభుత్వం కూడా పేర్కొంది. భారత ప్రధాని, విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ పేర్కొనలేదని ప్రకటించింది.

    ట్రూడో వ్యాఖ్యలతోనే వివాదం..
    ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో ఆరోపించారు. దీంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏడాది తర్వాత ఎలాంటి ఆధారం లేకుండానే మరోసారి అవే ఆరోపణలు చేశారు. నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల పేర్లతో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చారు. దీంతో భారత్‌–కెనడా దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.